Oasis Fertility :తొలి విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేల జంటలకి ఆశను కల్పించి , అవగాహనను పెంచిన తర్వాత, భారతదేశంలో 16 సంవత్సరాలుగా నమ్మకమైన ఫెర్టిలిటీ నిపుణులుగా నిలిచిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, రెండో విడత ‘ఓయాసిస్ జనని యాత్ర’ అనే దేశవ్యాప్త ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాన్ని 24 నవంబర్ 2025న విశాఖపట్నం నుంచి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు గంటా శ్రీనివాస్, వంశీ శ్రీనివాస్, రఘు రామకృష్ణ రాజు, సీతారామ రాజు, డా కాళి కుమారి,  డా మట్టా శ్రీదేవితో సహా ఇతరులు హాజరయ్యారు. ఈ ప్రచార ఉద్యమం స్థానిక సముదాయాలకు ఫెర్టిలిటీ అవగాహనను కల్పించి, తల్లిదండ్రులవ్వాలనే ఆశ దిశగా మొదటి అడుగు వేయడానికి సహాయం చేయడమే లక్ష్యంతో ప్రారంభమైంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఫెర్టిలిటీ రేటు 1.5కి పడిపోవడం, ఇది 2.1 రీప్లేస్‌మెంట్ స్థాయికి చాలా తక్కువ, ఈ నేపథ్యంలో వంధ్యత్వం కీలకమైన సమస్య అయినప్పటికీ ఇదో ప్రజారోగ్య సమస్యగా మారింది. ఫెర్టిలిటీ చికిత్స కోసం చాలా కుటుంబాలు దూర పట్టణాలకు ప్రయాణించాల్సి రావడం, ఆర్థిక, భావోద్వేగ, టైంవిషయంలో ఇబ్బందులు పడుతున్నారు. సమీప ప్రాంతాల్లో నాణ్యమైన ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉండాలి అన్న అవసరాన్ని ఈ కార్యక్రమం మరింత స్పష్టంగా చూపుతోందంటున్నారు నిర్వాహకులు.
 
‘ఓయాసిస్ జనని యాత్ర’ సమాజాల్లో వంధ్యత్వానికి దారితీసే కారణాలు, జీవనశైలిలో చేయాల్సిన మార్పులపై అవగాహన కల్పించే ఒక ప్రత్యేక ఉద్యమం. ఈ ప్రచార యాత్రలో ఆధునిక సాంకేతికతతో కూడిన ఫ్రీ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ విశాఖ నుంచి టియర్-II & టియర్-III పట్టణాలలో ప్రయాణిస్తూ, ప్రజలను సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి చైతన్యపరుస్తుంది.
 
ఈ మొబైల్ క్లినిక్ ద్వారా:
 
•అనుభవజ్ఞులైన ఫెర్టిలిటీ నిపుణులతో ఉచిత కన్సల్టేషన్లు
 
•మహిళలకు ఉచిత AMH & హీమోగ్లోబిన్ పరీక్షలు
 
•ఉచిత వీర్య పరీక్ష
 
•పరిశుభ్రమైన, సురక్షిత శాంపిల్ కలెక్షన్ జోన్లు అందిస్తున్నాయి.
 
ఫెర్టిలిటీపై శాస్త్రీయ, నిర్ధారణాత్మక, నివార‌ణ సమాచారాన్ని నేరుగా ప్రజలకు చేరవేసే ఈ యాత్ర, వంధ్యత్వంపై ఉన్న మౌనాన్ని చెరిపేసి, అపోహలు, అపనమ్మకాలను తొలగించి, పురుషులు—మహిళలు ఇద్దరికీ తమ ఫెర్టిలైటీ ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తూ, అవగాహన & సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు శాస్త్రీయ పరిష్కారాలను చేరవేయడమే లక్ష్యం.
 
ఈ యాత్ర ప్రారంభోత్సవంలో భాగంగా, పేరెంట్‌హుడ్‌ కోసం వాక్‌థాన్ కూడా నిర్వహించారు. వంధ్యత్వంపై అవగాహన పెంచడం, ఆధునిక సైన్స్ ఆధారిత ఫెర్టిలిటీ చికిత్సల ప్రాముఖ్యతను వివరించడం లక్ష్యంగా ఈ వాక్‌థాన్ జరిగింది. విద్యార్థులు, కుటుంబాలు, హెల్త్‌కేర్ నిపుణులు వంటి వివిధ వర్గాలు పాల్గొన్నారు.
 
డాక్టర్ దుర్గాజీ రావు, మెడికల్ డైరెక్టర్ & కో–ఫౌండర్, ఓయాసిస్ ఫెర్టిలిటీ, మాట్లాడుతూ, “సైన్స్ ఫెర్టిలిటీలో కొత్త మార్గాలను తెరిచింది. ‘ఓయాసిస్ జనని యాత్ర’ ద్వారా అవగాహన, చర్య మధ్య ఉండే అంతరాన్ని తగ్గిస్తూ, ప్రజలకు ఆధారపూర్వక పరిష్కారాలను అందించడమే మా మిషన్. ప్రతి జంట శాస్త్రం మీద నమ్మకంతో, ఆశను సాకారం చేసుకునేలా చేయడమే మా లక్ష్యం."అని అన్నారు.  
 
గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ, “సమాజ స్థాయిలో ఆరోగ్య అవగాహన పెరిగితే దేశం మరింత బలపడుతుంది. ‘ఓయాసిస్ జనని యాత్ర’ ఫెర్టిలిటీ ఆరోగ్యం గురించి ప్రజలకు అవసరమైన సమాచారం తీసుకెళ్తున్న విలువైన కార్యక్రమం. ప్రజలకు అవగాహన కల్పించడంలో ఓయాసిస్ ఫెర్టిలిటీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను.”
 
వంశీ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఫెర్టిలిటీపై అవగాహనను ప్రతి ఇంటి వరకూ తీసుకెళ్లే అర్థవంతమైన అడుగు ఇది. శాస్త్రీయపరమైన సమాచారం పట్టణాలు, గ్రామాల్లోకి చేరినప్పుడు భయం, కొంత సందేహం, అపోహలు తొలగిపోతాయి. కుటుంబాలకు నిపుణుల మార్గదర్శకత్వం అందించడంలో ఓయాసిస్ ఫెర్టిలిటీ చేస్తున్న సేవ అభినందనీయం.”, అన్నారు.
 
డాక్టర్ రాధిక పొట్లూరి, రీజినల్ మెడికల్ హెడ్ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫెర్టిలిటీ, “ఓయాసిస్ ఫెర్టిలిటీలో మా లక్ష్యం ఎల్లప్పుడూ మంచి క్లినికల్ ఫలితాలను అందించడం, ప్రతి జంటకు ఆరోగ్యమైన బిడ్డను అందించే అవకాశాలను పెంచడం. ‘జనని యాత్ర’ వంటి కార్య‌క్ర‌మాల ద్వారా ఫెర్టిలిటీ అవగాహనను, నిపుణుల మార్గదర్శకత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేస్తాం. ప్రతి ఆశ గల జంటకు సురక్షితమైన, శాస్త్రీయమైన సహాయాన్ని అందించడమే మా ధ్యేయం.”, అని తెలిపారు.
 
పుష్కరాజ్ షెనై, CEO, ఓయాసిస్ ఫెర్టిలిటీ, “భారతదేశ ఫెర్టిలిటీ రేటు ఇప్పుడు రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే తగ్గిపోతోంది. ఈ సమయంలో అవగాహన, సమయానికి రిప్రొడక్టివ్ కేర్ మరింత ముఖ్యమైంది. ఓయాసిస్ ఫెర్టిలిటీలో, జంటలు ఎక్కడున్నా—వారి ఇళ్లు, సమాజాలు, ఉద్యోగస్థలలో—అక్కడికే శాస్త్రీయమైన చికిత్సలు ‘ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్’ అందిస్తున్నాం.”, అని తెలిపారు. 

ఓయాసిస్ ఫెర్టిలిటీ గురించి:

2009లో స్థాపితమైన ఓయాసిస్ ఫెర్టిలిటీ, భారత్‌లోని 21 నగరాల్లో 34 కేంద్రాలతో, దేశవ్యాప్తంగా విశ్వసనీయ ఫెర్టిలిటీ సెంటర్లలో ఒకటి. అధిక IVF విజయం రేటుతో పేరుపొందిన ఓయాసిస్, ఇప్పటివరకు 1,15,000కి పైగా ఆరోగ్యమైన శిశువులను జంటలకు అందించింది. పురుషులు & మహిళలకు విస్తృత ఫెర్టిలిటీ సేవలతోపాటు, కౌన్సెలింగ్, నిర్ధారణ, IVF, IUI, ICSI వంటి ఆధునిక చికిత్సలు, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ సేవలు అందిస్తోంది. శారీరక, భావోద్వేగ, ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర సేవలు అందించడమే సంస్థ ధ్యేయం. వివరాలకు: www.oasisindia.in