Nara Lokesh different style of investment announcement: ఏపీ మంత్రి నారా లోకే,్.. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న పెట్టుబడుల విషయంలో టీజర్స్ ఇస్తూ ఆసక్తి రేపుతున్నారు. బుధవారం ఇలా ఓ టీజర్ ఇచ్చి గురువారం ఉదయం 9 గంటలకు ప్రకటిస్తానని.. చెప్పారు. అన్నట్లుగా రెన్యూపవర్ పెట్టుబడుల గురించి చెప్పారు. గురువారం మరో టీజర్ ఇచ్చారు. ఓ గ్లోబల్ ఫండ్ భారీ పెట్టుబడులతో వస్తోందని.. .ఎవరైనా గేస్ చేయగలరా అని క్విజ్ పెట్టారు.
ఆంధ్రప్రేదశ్ యువతకు ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగావకాశాలు తెచ్చి పెట్టాలన్న లక్ష్యంతో నారా లోకేష్ పెట్టుబడుల ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి ఏడాదిలోనే పది లక్షల కోట్లకుపైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. చాలా కంపెనీలు తమ ఇన్వెస్ట్ మెంట్స్ ను గ్రౌండింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా మరో పది లక్షల కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాలు చేసుకోనున్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ఇప్పడు ఒప్పందాలు చేసుకుంటున్న కంపెనీలన్నీ తమ పెట్టుబడులను గ్రౌండ్ చేసి.. తమ ప్లాంట్ల నుంచి ఉత్పత్తులు, కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చేయాలనుకుంటున్నారు. దాని వల్ల ఏపీ యువతకు ఉద్యోగావకాశాలు భారీగా లభించనున్నాయి.
నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు తనకు ఉన్న పరిచయాలతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలతో పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని రాయితీలు ఏపీ ప్రభుత్వం ఇస్తోంది. ప్రతి రంగానికి ప్రత్యేకమైన పాలసీలు ప్రకటించి.. పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.