Nara Lokesh Convoy Slightly Damages a Car in Visakha : రాజకీయ నాయకులు అంటే సామాన్యుల బాధతలు పట్టించుకోరని.. తాము సవారీ చేయడానికే ఉన్నామని అనుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్నవారు అయితే ఇంకా ఎక్కువ. కానీ కొంత మంది డౌన్ టు ఎర్త్ ఉంటారు. అలాంటి రాజకీయ నేతల్లో నారా లోకేష్ ఒకరు. విశాఖలో జరిగిన ఈ ఘటనపై ఆయన స్పందనే దీనికి నిదర్శనం.
నారా లోకేష్ సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వెళ్లారు. ఆయన కాన్వాయ్ రోడ్డుపై దూసుకెళ్తున్న సమయంలో ... మరో కారును తాకింది. ఆ కారుకు కాస్త డ్యామేజ్ అయింది. కానీ కాన్వాయ్ ఆపలేదు. డ్యామేజ్ అయిన కారు ఓనర్ కల్యాణ్ భరద్వాజ్ వెంటనే సోషల్ మీడియాలో పెట్టి నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు. మీ కాన్వాయ్ డ్యామేజ్ చేసిందని ఫోటోలు పెట్టారు.
వెంటనే నారా లోకేష్ కూడా స్పందించారు. సీఐఐ సదస్సులో పారిశ్రామిక వేత్తలతో సమావేశాల్లో బిజీగా ఉన్నప్పటికీ రిప్లయ్ ఇచ్చారు. తన కాన్వాయ్ వల్ల జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరగకుండా తన సెక్యూరిటీకి జాగ్రత్తలు చెబుతానన్నారు. తన టీమ్ కారుకు అయిన డ్యామేజీ ఖర్చును భరిస్తుందని.. హామీ ఇచ్చారు.
లోకేష్ స్పందనపై కారు యజమాని కల్యాణ్ భరద్వాజ్ సంతోషం వ్యక్తం చేశారు.
సహజంగా రాజకీయ నేతలు ఇలా స్పందించడం కష్టం. భరించాల్సినోడిదే తప్పు అన్నట్లుగా ఉంటారు. సోషల్ మీడియా ఉండటం వల్ల నేరుగా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగలిగారు. అదో అడ్వాంటేజ్ అనుకోవచ్చు. లేకపోతే ఆయన కూడా జరిగిన డ్యామేజ్ చెప్పుకోవడానికి లోకేష్ దగ్గరకు వెళ్లడం సాధ్యమయ్యే పని కాదు.
మోహన్ బాబు ఇంట్లో దొంగతనం... చేసింది ఎవరు? డబ్బులతో ఎక్కడికి పారిపోయాడంటే?