Minister RK Roja: విశాఖపట్నం వైఎంసీఏ బీచ్ రోడ్‌లో ఆంధ్రా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్ షిప్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. మంత్రి ఆర్కే రోజా వీటిని ప్రారంభించారు. 14 రాష్ట్రాల నుంచి 400 మంది బాక్సింగ్ క్రీడాకారులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి (కేవీఆర్‌), రాష్ట్ర బ్రాహ్మణ ఛైర్మన్‌ సుధాకర్‌, వరుదు కళ్యాణి, సీతం రాజు సుధాకర్, జీసీసీ ఛైర్ పర్సన్ స్వాతి రాణి, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభారవి బాబు పాల్గొన్నారు. 




ఈ పోటీల్లో  14 రాష్ట్రాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారని మంత్రి రోజా తెలిపారు. గత ఏడాది అద్భుతంగా రాష్ట్రంలో స్థాయిలో బాక్సింగ్ పోటీలను నిర్వహించారని పేర్కొన్నారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించడం మరింత సంతోషంగా ఉందని తెలిపారు. మేము అంతా జగనన్న అభిమానులం, జగనన్న కోసం ఏమైనా చేస్తాం అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాలు ప్రజలు కలిపి చేసుకొనే పండగ జగనన్న పుట్టినరోజు మాత్రమే అని చెప్పారు. వైజాగ్ తో తనకు విడదీయరాని సంబంధం ఉందని స్పష్టం చేశారు. తాను చేసిన చామంతి సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందని గుర్తు చేశారు. విశాఖ ప్రజలకు ప్రతి విషయంలో  ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు. 



సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా బాక్సింగ్ పోటీలను నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్ కాయల వెంకట రెడ్డి తెలిపారు. నాలుగు రోజులు పాటు ఈ క్రీడలు జరగనున్నాయని, వచ్చే ఏడాది ఇంతకంటే బాగా బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ పుట్టిన రోజు(ఈనెల 21వ తేదీన) సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబారాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రక్తదాన శిబిర పోస్టర్ ను విడుదల చేశారు. రక్తదానం చేయాలనకున్న వారు ysrcpblooddonation.com లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 






ఇప్పుడు బాక్సింగ్ చేసిన రోజా నాలుగు రోజుల క్రింత దింసా ఆడి అలరించారు.