దుష్టశక్తులు ఊరిని చుట్టుముట్టాయి. వదళబొమ్మాళీ అంటూ పీడిస్తున్నాయి. ఇప్పటికే నలుగురి ప్రాణాలు తోడేశాయి. ఇక మావళ్ల కాదు. ఊరిలో ఉన్న పీడ వెళ్లగోడతాం. బయటవారు గ్రామాల్లోకి రావద్దు. మేము ఊరు దాటి రామంటోదా పల్లె. శ్రీకాకుళం జిల్లా ఓ మారుమూల గిరిజన గ్రామంలో కొన్ని రోజులుగా జరుగుతున్న తంతు ఇది.  


శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస ఓ కుగ్రామం. గత కొన్నిరోజులుగా గ్రామంలో కొందరు వ్యక్తులు  జ్వరంతో బాధపడ్డారు. వారిలో పరిస్థితి విషమించి ఒకరిద్దరు చనిపోయారు. దీన్ని కీడుగా భావించారు గ్రామ ప్రజలు. రోగాల బారిన పడ్డవారికి వైద్యం చేయించడం మానేసిగ్రామానికి దుష్టశక్తులు ఇబ్బంది పెడుతున్నాయని ప్రచారం మొదలు పెట్టారు. ఒకరిద్దరి నుంచి మొదలైన ఈ ప్రచారం ఊరంతా పాకింది. ఇక ఎవర్ని కదిలించినా ఇదే వాదన.  


ఇలా ఊరుకుంటే అసలు తమ ఉనికికే ప్రమాదం వస్తుందని భావించారు. గ్రామ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ పెద్దలు కూర్చొని మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. దుష్ట శక్తులు తరిమేందుకు డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంటింటికీ వెళ్లీ చందాలు వసూలు చేశారు. 


ఇలా ప్రజల నుంచి చందాలుగా వసూలు చేసిన డబ్బుతో తాంత్రిక పూజలకు వినియోగించారు. ఒడిశా, విజయనగరం ప్రాంతాలకు చెందిన మంత్రగాళ్లను సంప్రదించారు. వీరు పడుతున్న టెన్షన్ గుర్తించిన మాంత్రికులు గ్రామంలో భయంకరమైన శక్తులు బస చేశాయని నమ్మబలికారు. ఒకటి రెండు ఉదాహరణలు చెబుతూ ఆ శక్తులు చేరడంతోనే, వాటి వల్ల రోగాల పాలవ్వడమే కాక ప్రాణాలు కోల్పోతారని చెప్పారట. ఊరు బాగుండాలంటే తక్షణమే చెప్పినట్లుగా చేయాలని ఓ భయం మాట పడేశారు. 


మాంత్రికుల మాటలు విన్న ఊరంతా ఒక్కటై గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారు. గ్రామానికి నాలుగు దిక్కులు నిమ్మకాయలు పెట్టారు. గ్రామంలో రాకపోకలు సాగిస్తే ఆ శక్తులను కట్టడి చేయలేమని మాంత్రీకులు పేర్కొన్నారట. ఒకటి కాదు రెండు కాదు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకూ ఈ కట్టడి అమలు చేస్తున్నారు.  


తొలుత ఈనెల 17 నుంచి 20వ వరకు రాకపోకలను నిషేధించారు. అయిన దుష్టశక్తులు పవర్‌తో కట్టడి చేయలేకపోతున్నామంటు మరో అయిదు రోజులపాటు అంటే ఈ నెల 25 వరకు పొడిగించారు. అంతవరకు ఎవరూ బయటకెళ్లొద్దని, బయటవారు రావద్దని హెచ్చరిక జారీ చేసి గ్రామానికి వచ్చే రహదారిని మూసేశారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు తెరవడంలే.దు సచివాలయ పరిధిలో పని చేసే ఉద్యోగులు,  వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు రావద్దని హెచ్చరించారు. 


మూడనమ్మకాలను నమ్మవద్దని అనారోగానికి గురైన వారిని ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్దామన్న వినేవారు లేరని ఆగ్రామస్థులు కొందరు చెప్పడం కొసమెరుపు.