K Viswanath Passed Away: కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు విజయనగరం జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉంది. వివిధ సందర్భాల్లో సుమారు 10 సార్లకుపైగా ఆయన విజయనగరం జిల్లాకు వచ్చారు. 2003వ సంవత్సరంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య.. గురజాడ విశిష్ట పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. 1994లో ప్రఖ్యాత నటుడు కమలహాసన్‌తో రూపొందించిన శుభసంకల్పం సినిమా విజయనగరం పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. మండలంలోని జొన్నవలసలో డివై సంపత్ కుమార్ శిక్షణలో ఆంధ్రజాలారి నృత్యాన్ని కమలహాసన్ తో చిత్రీకరించారు. జొన్నవలసలో షూటింగ్ జరిగిన ఇల్లు, చెరువు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఆనాటి జ్ఞాపకాలను, విశ్వనాథ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు.
2006లోనే విజయనగరం కొత్త అగ్రహారంలోని శివ్వా నానాజీ ఇంట్లో సుమారు 15 రోజుల పాటు విశ్వనాథ్ ఉన్నారు. బాబామెట్టలోని సంప్రదాయ వైద్యులు రజనీకాంత్ విశ్వనాథ్ మోకాళ్ళ నొప్పులకు 15 రోజులు చికిత్స అందజేశారు. ఇదే సమయంలో ఆనంద గజపతి కళాక్షేత్రంలో విజయనగరానికి చెందిన యువ గాయనీ, గాయకులతో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో పాల్గొన్నారు విశ్వనాథ్. రాత్రి 10:30 గంటల వరకు ఉండి అద్యంతం ఆస్వాదించి.. వారి అద్భుతమైన స్పందనను తెలియజేశారు. తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజు అంటూ అక్కడ వారితో అన్నారు. సుమారు పది నిమిషాల పాటు ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ఆత్రేయ స్మారక కళాపీఠం అధ్యక్షులు ఉసిరికల చంద్రశేఖర్ షష్టిపూర్తి కార్యక్రమానికి వేటూరితో కలిసి ఆయన ఒకసారి విచ్చేశారు. విజయనగరం ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో పురస్కారాన్ని విశ్వనాథ్ దంపతులకు అందజేశారు. ఆ సమయంలో ప్రస్తుత ఏపీ అసెంబ్లీ సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి స్వయంగా ఆయనకు గంధం పూసి, తిలకం దిద్దారు.
2010వ సంవత్సరంలో శుభప్రదం సినిమా చిత్ర బృందంతో విజయనగరం రోటరీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అభినందనలు స్వీకరించారు. ఇటీవల విజయనగరం పట్టణంలోని సన్ స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ సందర్భంలోనే ప్రఖ్యాత రామనా
అనారోగ్య కారణాలతో మృతి చెందిన కళాతపస్వి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో మరణించారు.
సినిమాల్లో విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలైంది. వాహిని స్టూడియోస్ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'పాతాళ భైరవి' చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.
తొలి సినిమాకు నంది
'ఆత్మ గౌరవం' సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'చెల్లెలి కాపురం', 'శారదా', 'ఓ సీత కథ', 'జీవన జ్యోతి' చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి.