Vizag YSRCP :  వైఎస్ఆర్‌సీపీలో నేతల మధ్య రాజకీయ పోరాటం హద్దులు దాటుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఆధిపత్య పోరాటం కారణంగా సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ బాధ్యతలు వదులుకున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయని వైజాగ్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిమామాలు వెల్లడిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.                           
 
విజయసాయిరెడ్డి అనుచరులు సస్పెండ్    


విశాఖలో పీవీ సురేష్ అనే కార్పొరేటర్ ను వైఎస్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ను  పార్టీ నుంచి బహిష్కరించారు. అలాగే దొడ్డి మురళి అనే మరో డివిజన్ అధ్యక్షుడికీ గుడ్  బై చెప్పింది. దీంతో విశాఖ వైసీపీలో కలకలం ప్రారంభమయింది. ఎందకంటే విర్దదరూ విజయసాయిరెడ్డికి అనుచరులు. గతంలో విజయసాయిరెడ్డికి విగ్రహం పెట్టి మరీ పాలాభిషేకం చేశారు దొడ్డి మురళి. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి  బహిష్కరించారు.  మూడు రోజుల కిందట విజయసాయిరెడ్డి అనుచరుల్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు సుబ్బారెడ్డి. వెంటనే విజయసాయిరెవడ్డి పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జ్ హోదాలో మళ్లీ వారిని పార్టీ పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది కూడా వివాదాస్పదమవుతోంది. 
   
విశాఖలో ఎలాంటి పార్టీ  బాధ్యతలు లేని విజయసాయిరెడ్డి                                      
 
విశాఖకు విజయసాయిరెడ్డి చాలా కాలం ఇంచార్జ్ గా ఉన్నారు. విజయసాయిరెడ్డికి సీఎం జగన్ ప్రాధాన్యం తగ్గించారు.  ప్రస్తుతం విశాఖ వైసీపీ ఇంచార్జ్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.   విజయసాయిరెడ్డి నియమించిన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించారు. తాను నియమించారు. విశాఖపై పట్టు కోల్పోకూడదనుకుంటున్న విజయసాయిరెడ్డి వెంటనే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుని హోదాలో.. మళ్లీ విశాఖలో తన అనుచరుల్ని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా చర్యలు తీసుకుంటూడటంతో వివాదం ముదిరిపోతోందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.                               


హైకమాండ్ జోక్యం చేసుకుంటుందా ?                              


విజయసాయిరెడ్డి  ఇటీవల సైలెంట్ గా ఉంటున్నారు. ఢిల్లీలోనే ఎక్కువ ఉంటుంది. ఇటీవల బాలినేని రాజీనామా చేసిన  మూడు జిల్లాల కోఆర్డినేటర్ పదవిని విజయసాయికి ఇచ్చారన్న ప్రచారంఉంది.  కానీ ఈ అంశంపై అధికారికంగా ప్రకటన లేదు.  ఇలా బాధ్యతలిచ్చారని విజయసాయిరెడ్డి కూడా ప్రకటించలేదు.  ఇప్పటికే  వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య జరిగిన పోరాటం కాస్తా అంతర్గత వివాదాలకు కారమం అయింది. ఇప్పుడు విశాఖ ఇష్యూ వైసీపీలో మరింత గందరగోళానికి కారణం అవుతోంది. హైకమాండ్ జోక్యం చేసుకుని ఇలాంటి వాటిని పరిష్కరించాలని వైసీపీ నేతలంటున్నారు.