Cognizant campus to be set up in Visakhapatnam : విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాదిలో నిర్మాణాలు ప్రారంభించి.. 2029కల్లా పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తారు. ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కాగ్నిజెంట్ రూ. 1,583 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సుమారు 8,000 మందికి ఈ క్యాంపస్‌లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగ్నిజెంట్‌కు కాపులుప్పాడలో 21.31 ఎకరాల స్థలం కేటాయించారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో ఇప్పటికే గూగుల్ , టీసీఎస్ వంటి సంస్థలను తమ క్యాంపస్‌లను పెట్టడానికి అంగీకరింపచేశారు.
కాగ్నిజెంట్ ను ఏపీకి తీసుకు రావడానికి నారా లోకేష్ గట్టి ప్రయత్నాలు చేశారు. జనవరి 2025లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో నారా లోకేష్, కాగ్నిజెంట్ సీఈఓ ఎస్. రవి కుమార్ మధ్య జరిగిన చర్చలు జరిగాయి. ఆ చర్చల తర్వాత అధికారులు ఫాలో అప్ చేశారు. చివరికి కాగ్నిజెంట్.. పెట్టుబడికి రెడీ అయింది.
పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత విశాఖలో కాగ్నిజెంట్ ప్రతినిధులతో ఒప్పందం జరిగింది. ఈ నెల ఇరవైన.. ఈ అంశంపై విశాఖలో కాగ్నిజెంట్ ప్రతినిధులు , లోకేష్ చర్చలు జరిపారు.
ఇప్పుడు అధికారికంగా కాగ్నిజెంట్ ప్రకటన చేసింది.