Vizag News :  వైజాగ్ లో ఉన్న ఓ ప్రాంతానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పేరు మార్చడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ అంశంపై ట్వీట్ చేశారు. అబ్దుల్ కలాం పేరును తొలగించి వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చడం బాధాకరం అన్నారు. ఇలా ఆ మహనీయుడు పేరు తీసేయడం అబ్దుల్ కలాంను అవమానించడమేనంటూ ట్వీట్ చేశారు. అయితే ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ టీమ్ సైతం రంగంలోకి దిగి, వాస్తవాలను వెల్లడించింది. ఆ వ్యూ పాయింట్ ను ఇటీవల డెవలప్ చేసి అధికారుల అనుమతితో వైఎస్సార్ వ్యూ పాయింట్ గా నామకరణం చేసినట్లు వెల్లడించింది.





ఈ వ్యూ పాయింట్ సీతంకొండ సమీపంలో ఉంటుంది. నిజానికి ఈ వ్యూపాయింట్ ను గతంలో ప్రభుత్వం కాకుండా వైజాగ్ వాలంటీర్స్ అనే స్వచ్చంద సంస్థ అభివృద్ధి చేసినట్లు చెబుతోంది. అబ్దుల్ కలాం పేరు పెట్టి.. వ్యూ పాయింట్‌ను ఓ మాదిరిగా అభివృద్ధి చేశామంటున్నారు. అయితే  ఇటీవల G20 సదస్సు సుందరీకరణలో కేంద్రం నిధులు పెట్టి అభివృద్ధి చేశారని భిన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ వ్యూ పాయింట్ కు వైఎస్ఆర్ గా నామకరణం చేశారు. కలాం వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ గా మార్చారంటూ మాజీ సీఎం చంద్రబాబు, వైజాగ్ వాలంటీర్స్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 


అయితే కలాం పేరు  గవర్నమెంట్ శాశ్వతంగా చట్టప్రకారం పెట్టాలని దీనివల్ల అబ్దుల్ కలాం సర్ కి మన వైజాగ్ ప్రజలు శాశ్వత గౌరవం ఇవ్వడానికి  అందరి సహకారం మరియు ప్రోత్సాహం కోరుతున్నామని వైజాగ్ వాలంటీర్స్ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.  సీతకొండ ప్రాంతం ని కలాం వ్యూ పాయింట్ గా పేరు పెట్టి వేల మంది వాలంటీర్స్ ని మోటివేట్ చేశామని, గవర్నమెంట్ శాశ్వతంగా చట్టప్రకారం పెట్టాలని దీనివల్ల అబ్దుల్ కలాం సర్ కి మన వైజాగ్ ప్రజలు శాశ్వత గౌరవం ఇవ్వడానికి మీ అందరి సహకారం కావాలని వైజాగ్ వాలంటీర్లు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. వాస్తవానికి గూగుల్ లో కూడా ఆ ఏరియా కలామ్ వ్యూ పాయింట్ అని చూపిస్తుంది.



ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ రెస్సాన్స్..


ఆ ప్రాంతాన్ని గతంలో డెవలప్ చేయలేదని, ఆ వ్యూ పాయింట్ కు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనే పేరు అధికారంగా ఎప్పుడూ పెట్టలేదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. జీ20 సదస్సు సందర్భంగా వైజాగ్ నగర సుందరీకరణ పనులలో భాగంగా అనుమతులు తీసుకుని అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు చేసినట్లు ట్వీట్ చేశారు. వైఎస్సార్ వ్యూ పాయింట్ గా పేరు పెట్టేందుకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకున్న పత్రాలను సైతం ఫ్యాక్ట్ చెక్ టీమ్ పోస్ట్ చేసింది. ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవాలని, దీనిపై దుష్ప్రచారం చేయవద్దని సూచించింది.