Botsa Satyanarayana About Contructions on Rushikonda: 
చంద్రబాబు బస్సు ఎక్కాడు, సొంత పుత్రుడు లోకేష్ రోడ్డు ఎక్కాడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కాడు.. కానీ వీళ్లు ఏం చేసినా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలన్నదే తమ నినాదం అని, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 


విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో  శనివారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా తమ నినాదం కాగా, టీడీపీ హయాంలో హోదాను తాకట్టుపెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతుల హత్యలు ఆకలి చావుతో జరగలేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని డబ్బా పలుకుతున్నాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. దోపిడీ  వ్యవస్థ చంద్రబాబు టైములో ఎక్కువగా జరిగిందన్నారు. జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల సోమ్ములను దోచుకున్నారని ఆరోపించారు.
 
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల పాలనకు, వైఎస్ జగన్ కేవలం 4 ఏళ్ల పాలనకి బేరీజు వేసి చూస్తే ఎవరి పాలన బాగుందో ప్రజలకు తెలుస్తుందన్నారు.  ప్రజల వైసిపి పాలనను హర్షిస్తారు తప్ప మిగతా పార్టీల పాలనలు ఏనాడు మెచ్చుకోలేదన్నారు. రుషికొండపై ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపడుతున్నాం, ప్రభుత్వ భవనాలే నిర్మిస్తున్నామని తేల్చి చెప్పేశారు బొత్స సత్యనారాయణ. గతంలోనే ఋషికొండపై నిర్మాణాలు ప్రభుత్వ  భవనాలు కడుతున్నామని మేం చెప్పినా.. జనసేనాని పవన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.


దేశ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం  వాడుకున్నారన్నారు. విద్య, వైద్యం ఇలా చెప్పుకుంటే చాలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది వైసీపీ సర్కార్ అన్నారు మంత్రి బొత్స. మాజీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహనంతో మాట్లాడాలని, ఎంత అరిచినా ఈ 6 నెలలు మాత్రమేనని తరువాత అరవడానికి ఏం ఉండదంతూ ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడుకున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.


జనసేనాని పవన్ కళ్యాణ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విశాఖలో క్రైం రేట్ పెరిగి పోయిందని. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. ఏదైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయటం లేదని, ఏపీ నేరాలకు నిలయంగా మారిందన్నారు. ఇప్పుడు బిహార్ చాలా బాగుంది. ఉత్తరాంధ్ర భూ దోపిడీ పై మాట్లాడటానికి ఇక్కడ నాయకులు లేరు. అనకాపల్లలో ఖనిజ సంపద దోచేస్తున్నారని ఆరోపించారు. అమ్మఒడికి డబ్బులు లేవు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఖాతరు చేయడం లేదు. మకవరపాలెం మండలంలో 174 జీవో ద్వారా నిధులు మంజూరు. కానీ ఫారెస్ట్ లాండ్ లో నిబంధనలు ఖాతరు చేయకుండా దోపిడీ జరిగింది. ఖనిజ తవ్వకం ఒకరికి కేటాయిస్తే మరొకరికి ఇస్తోంది జగన్ ప్రభుత్వం. పోలీసులు చూస్తుండగా బోట్ తగలబెట్టారు. బ్రిటీష్ పాలన కంటే వైసీపీ పాలనలో ఏపీ దారుణంగా తయారైందన్నారు.