విశాఖ మన్యంలో మైనింగ్ కోసం జీడి తోటల్ని కేటాయించడంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయం వెనక్కి తీసుకోకరోతే జీడిచెట్లకే తాము ఉరి వేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం ఉరవకొండ గ్రామంలో జీడిచెట్లపై ఆధారపడి గిరిజనలు బతుకుతున్నారు. అయితే ఇటీవల ఆ భూములన్నింటినీ మైనింగ్‌కు ఇచ్చేశారు. దీంతో గిరిజనులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో  ఉరవకొండ పై గిరిజనులు ఉరి తాళ్లతో నిరసన తెలియజేశారు. తాము జీడి తోటల పై ఆధారపడి జీవిస్తున్నామమని తమకు  డి పట్టా భూములు ప్రభుత్వం  ఇచ్చిందని తెలిపారు. మాడుగుల ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్,  ఎమ్మార్వో  గిరిజనుల పట్ల వివక్ష చూపడంతో గిరిజనుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని.  మైనింగ్ కంపెనీ తో కుమ్మక్కయి  ఆదివాసీ గిరిజనుల జీడి తోటలు అన్ని అక్రమంగా గ్రానైట్ లీజు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము గ్రానైట్ కంపెనీ నుంచి డబ్బులు అడుగుతున్నామని తప్పుడు ప్రచారంచేస్తున్నారని.. మా జీడి తోట భూముల్లో జెసిబిలు తో ధ్వంసం చేస్తున్న చెట్లను అడ్డుకుంటే రెవెన్యూ అధికారులు మాపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.   జీడి తోటలు తొలగిస్తే మాకు ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదని వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.  


విశాఖ జిల్లా  వి మాడుగుల మండలం ఉర లోవ  రెవిన్యూ పరిధిలో శ్రీ లక్ష్మి నరసింహ గ్రానైట్ కంపెనీకి సర్వే నెంబర్ OLD (1) న్యూ నెంబర్3 లో 18 యాక్టర్ ల కు 2019 న లీజుకు ఇచ్చారు. లీజుకు ఇచ్చిన ప్రదేశంలో  సర్వే నెంబర్ 52.53.54. లో 26 ఎకరాల 79 సెంట్లు 2012-13 సంవత్సరంలో 10 మంది ఆదివాసీ గిరిజనులు జీడి మామిడి తోటలు పై ఆధారపడి జీవిస్తున్నారు . ఆ భూమి చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ గ్రానైట్ క్వారీ వాళ్ళు బౌండరీ రాళ్ళను సరిహద్దుగా పెట్టారు. గిరిజనులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే  ఎనిమిది మంది ఆదివాసీ గిరిజన కుటుంబాలకు   ఈ భూమ్మీద మీకు ఎటువంటి హక్కు లేదు. మీకు పట్టాల ఒక దగ్గర. మేము సాగు ఒక దగ్గర చేస్తున్నట్లుగా మాడుగుల ఎమ్మార్వో గారు మమ్మల్ని అక్రమ దారులుగా గుర్తిస్తున్నారు. మాకు భూమి మీద ఎటువంటి హక్కు లేదని తేల్చారు. భూములను క్వారీకి అప్పగించాలని నిర్ణయించారు.







అయితే ప్రభుత్వం గుర్తించిన వారికి మూడు కుటుంబాలకు సర్వే నెంబర్ 52- మూడు ఎకరాల 22 లక్షల రూపాయలను గ్రానైట్ కంపెనీ చెల్లించింది.  2013 భూ సేకరణ చట్టం ప్రకారం గా మా జీడి మామిడి తోట కి భూమికి నష్టపరిహారాన్ని చెల్లించాలని గిరిజనులు కోరుతున్నారు.  లేకపోతే తమ భూములపై ఇచ్చినటువంటి మైనింగ్ లీజులను రద్దు చేయాలని కోరుతున్నారు.  రికార్డు ప్రకారం ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ లో పూర్తి విస్తరణ లేకపోయినా   మమ్మల్ని అక్రమ దారులుగా  ముద్రవేసి  మా జీడి తోట భూములను మైనింగ్ కంపెనీలకు అప్పగిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ పై అనకాపల్లి జాయింట్ కలెక్టర్ దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా లేకపోతే మాకు ఆత్మహత్య గతిని ఆదివాసి అందరూ సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని గిరిజనలు  హెచ్చరించారు.