Adari Kishore Kumar resigns to TDP- విశాఖపట్నం: అసలే ఎన్నికల సమయం కావడంతో నేతల జంపింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలుగు దేశం ఫైర్ బ్రాండ్ ఆడారి కిషోర్ కుమార్ పార్టీకి రాజీనామాకు చేశారు. శనివారం ఉదయం ( ఏప్రిల్ 20, 2024, శనివారం ) 8:30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, ఆడారి కిషోర్ కు కండువా కప్పి వైఎస్ఆర్ సీపీలోకి ఆహ్వానించనున్నారు.

  ఈ మేరకు ఆడారి కిషోర్ కుమార్ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.


ఆడారి కిషోర్ కుమార్ అసంతృప్తితో చంద్రబాబుకు బహిరంగ లేఖ
‘నా రాజకీయ జీవితం 30 ఏళ్లగా విద్యార్థి నాయకునిగా, నా జీవితాన్ని అంతటిని ప్రజలకు అంకితం చేస్తూ వచ్చాను. నా రాజకీయ జీవితం దాదాపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు విజనరీ అని, బడుగులకు అవకాశం కల్పిస్తుందని, వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరడానికి చంద్రబాబు వారసులు అని విశ్వసించి ఇప్పటివరకూ పార్టీకి సేవలు చేస్తూ వచ్చాను. నా సేవ లోపమో, లేదా నా సేవను గుర్తించడం పెద్దల లోపమో తెలియడం లేదు. ఎన్నోసార్లు వారు గౌరవిస్తానని, గౌరవిస్తూ వచ్చారు. అదే ఆ గౌరవం ఇప్పటివరకూ అగౌరవంగానే మిగిలిందేమో అనిపిస్తుంది. నేను స్వయంగా బాబు గారిని, లోకేష్ గారిని, అమ్మగార్ని కూడా ప్రత్యక్షంగా కలిసాం. అందరూ సానుకూలంగానే స్పందించారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ నీకే అని హామీ ఇచ్చి, తదుపరి వేరొకరికి ఇచ్చినా బాధ పడ్డానే తప్ప బయట పడలేదు. అయినప్పడికి వారు నా పట్ల వారు ప్రేమను చూపిస్తున్నారేమో అని భావించాను.


నేను ఎవ్వరూ చెయ్యని సాహసం ఆకాశం లో చేశానని, హైద్రాబాద్- విశాఖ పట్నం విమానం లో చంద్రబాబు కోసం సేవ్ డెమోక్రన్ ఫ్లకార్డులతో నిరసనలు చేశానన్నారు. చంద్రబాబు గారు కేసులో భాగంగా జైల్లో ఉండగా తెగ బాధపడి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వివిధ స్థాయిల్లో నిరసనలు చేశానన్నారు. దీనిలో భాగంగా విశాఖ పట్నం విమాన శ్రయం రన్ వే పైనే నిరసనలు చేశానని. దీని ఫలితంగా కేంద్ర పొలిసు బలగాల కేసుల్లో ఇరుక్కున్నాను. అలాగే అనేక ఉద్యమాల్లో చిన్నతనం నుంచి ఉభయ రాష్ట్రాల్లో ఉద్యమ స్పూర్తిని చూపిస్తున్నాను. నా ఉద్యమం నిజమే అని జనానికి తెలిసింది. అయితే పార్టీ అధిష్టానానికి తెలియలేదేమో అనిపిస్తోంది.


ఎన్నో ఉద్యమాల్లో రేసుల్లో జైలుకు, కోర్టులకి కూడా వెళ్లాం. ఇంకెన్ని కేసులు పెట్టించుకోవాలో, అవి తట్టుకున్న తర్వాత కూడా చివరకు పదవి వస్తుందో లేదో కూడా తెలియని స్థితి ఉంది. నేను నమ్ముకున్న పార్టీ నన్ను గుర్తిస్తుంది అనే నమ్మకం కూడా ఇకపై లేదు. బాబు గారు జైల్లో ఉండగా సేవ్ డెమోక్రన్ డెమాక్రన్ ఇన్ డేంజర్ ఉద్యమం ద్వారా దాదాపు అన్ని ప్రాంతాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించానని. వాటి ద్వారా అచేతనంగా ఉన్న ఎందరో సీనియర్ నాయకులను సుప్త చేతనావస్థ నుంచి మేలుకొలపడానికి అవిశ్రాంతంగా కృషి చేశానన్నారు.


లోకేష్ బాబు యువగళం యాత్రలో నా పాత్ర నేను శాయశక్తులా నిర్వహించాలని, నా ఆర్థిక స్థితి బాగా లేకున్నా. యువ గళం ప్రజలకు వినిపించాలని, యువనేతకు మహానేతగా చూడాలని ఇతోధికంగా నా వంతు ప్రయత్నంగా యువ గళానికి మూడు కార్వాన్ లను ఏర్పాటు చేసాను. భారీ ఖర్చుతో కూడుకున్నప్పడికి విస్తృతంగా ప్రచారం చేసాను. ఇటు నాయకుల్లో నాల్కలా ఉండాలి అనుకున్నా, ప్రజల్లో మమేకమై ఉండాలి అనుకున్నాను.


నాకు కూడా అర్ధశత వయస్సు ఆరంభం లోకి వచ్చింది. నాయకుడు అవ్వాలంటే రిటైర్ మెంట్ వయసు రావాలా అనే అనిపిస్తోంది. నన్ను గుర్తించడానికి ఇంకేమైనా చెయ్యాలా అనే అనుమానం వస్తోంది. నాకు ఈ పార్టీలో తగిన గుర్తింపు వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం లేని స్థితిలో ఏమి చెయ్యాలో తెలియని స్థితి నెలకొంది. నన్ను గుర్తించేందుకు ఇతర పార్టీల వాళ్ళ ఆహ్వానం అందుకోవడమా. లేక వారి ఆహ్వానాన్ని గౌరవించక పొతే అది అగౌరవం అవుతుందని భావిస్తున్నాను. మీ గౌరవాన్ని తిరస్కరించకుండానే.. ఎదుటి పార్టీ వారి ఆహ్వానం అందుకునే పరిస్థితి నెలకొంది.


నన్ను ఉద్యమ కారునిగా, నాయకునిగా గౌరవిస్తు, నన్ను కోరుకుంటున్న పార్టీ వారి కోసం అవేధనా తప్త హృదయంతో వారి ఆహ్వానాన్ని మన్నించే స్థితి వచ్చింది. ఎదుటి పార్టీ ఆహ్వానం మేరకు... అనకాపల్లి జిల్లా నక్కపల్లి లో 20 ఏప్రిల్, 2024న జరిగే వారి సభలో రేవు గుర్తించే అడుగులు వేస్తూ... అని టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.