Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

ABP Desam Updated at: 27 May 2022 02:38 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Jupudi Prabhakar Rao : "ఏమైనా మత్తులో ఉండి అలా చేశారా" అని శెట్టిబలిజలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై జూపూడి ప్రభాకర్ క్షమాపణలు కోరారు. తన ఉద్దేశం అదికాదన్నారు. ఎవరైనా బాధపడి ఉండే క్షమించాలని కోరారు.

ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్

NEXT PREV

Jupudi Prabhakar Rao : అమలాపురం ఘటన తెలుగుదేశం(TDP), జనసేన(Jansena) పార్టీలు చేసిన కుట్ర అని ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. సీఎం జగన్(CM Jagan) సమన్యాయ పాలన చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు ప్రభుత్వం బురద జల్లుతున్నాయని విమర్శించారు.  



  • వైసీపీ మూడేళ్ల పాలనపై



"మూడేళ్ల పాలనలో అంబేడ్కర్(Ambedkar) రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తున్న నేత సీఎం జగన్. ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే టీడీపీ, జనసేన ఓర్చుకోలేకపోతున్నాయి. అందుకే మూడేళ్ల పాలనను(Three Years Ruling) ప్రజలకు వివరించేందుకు 17 మంత్రులతో బస్సు యాత్ర(Bus Yatra) నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. నిన్న ఓ ప్రెస్ మీట్ లో నేను మాట్లాడుతూ.. శెట్టిబలిజలు, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న అవినాభావ సంబంధం ఎందుకు తెగిపోయిందో 'ఏమైనా మత్తులో ఉండి అలా చేశారా' అనే ఒక మాట మాట్లాడాను. కొందరు శెట్టిబలిజ(Shetty Balijas) సోదరులు బాధపడినట్లు తెలుస్తోంది. నా ఉద్దేశం అది కాదు. అంబేడ్కర్ ఇచ్చినటు వంటి రాజ్యాంగ ఫలాలను అగ్రవర్ణాలు, ఫ్యూడల్ శక్తులకు ఎదురునిలిచి సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాను. ఎవరైనా నా మాటలకు బాధపడి ఉంటే క్షమించాలి." - -జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు(సోషల్ జస్టిస్)



  • ప్రతిపక్షాలు రెచ్చగెట్టాయి


అమలాపురం ఘటన(Amalapuram Violence) తెలుగుదేశం, జనసేన పార్టీలు రెచ్చగొడితే కొందరు రెచ్చిపోయినట్లు కనిపిస్తుందని జూపూడి ప్రభాకర్ అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సమర్థంగా డీల్ చేసిందన్నారు. దాని గురించి ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ విధ్వంసానికి బాధ్యులైన వారిపై చర్యలుంటాయన్నారు. మూడేళ్ల పాలనలో అప్పులు(Debt) పెరిగాయని ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని జూపూడి అన్నారు. అప్పులు టీడీపీ ప్రభుత్వం లాగా కాంట్రాక్టర్ల కోసం చేయలేదన్నారు. ప్రజల కోసం అప్పులు చేశారని జూపూడి ప్రభాకర్ అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు, అన్ని వర్గాల్లోని పేదల కోసమే అప్పులు చేశారన్నారు. మూడు రాజధానులు అనేది వైసీపీ ప్రభుత్వం నిర్ణయం దానిని ఎట్టిపరిస్థితుల్లో మార్చే ప్రసక్తిలేదన్నారు. 



"శెట్టిబలిజలపై ప్రెస్ మీట్ లో నేను చేసిన కామెంట్స్ ను తప్పుగా అర్ధం చేసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది.  ఎవరైనా బాధపడి ఉంటే  క్షమాపణ కోరుతున్నా.  జగన్ మూడేళ్ల పాలన అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం అనుగుణంగా నడుస్తుంది. ప్రజలు మమ్మల్ని అర్ధం చేసుకుని ఆదరిస్తున్నారు.  వైజాగ్ రాజధాని వచ్చి తీరుతుంది." - -జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు(సోషల్ జస్టిస్)



  • శెట్టిబలిజలపై జూపూడి వ్యాఖ్యలు 


కోనసీమలోని శెట్టి బలిజలు అంబేడ్కర్‌ పేరును సహించలేని కొత్తరకం వచ్చిందని, మంత్రి ఇంటిని తగలబెట్టే సాహసం చేస్తారా అని మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. ఇది స్పహలో ఉండి చేయలేదని, మత్తులో ఉండి అలా ప్రవర్తించారని జూపూడి ప్రభాకర్‌ అన్నారు. కోనసీమ(Konaseema) అల్లర్లపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కోనసీమ లాంటి చైతన్యవంతమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఆందోళకరం అన్నారు. శెట్టి బలిజలు కోనసీమలో ఎస్సీలతో కలిసి ఉంటారని, ఎన్నికల్లో ఒక్కటవుతారన్నారు. కోనసీమలోని శెట్టి బలిజల్లో కూడా అంబేడ్కర్‌ పేరును సహించలేనటువంటి ఒక తరం వచ్చిందని, తనకు సమాచారం అందిందన్నారు. 


 

Published at: 27 May 2022 02:37 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.