Chandrababu Chit Chat : విశాఖ జిల్లాలో తాళ్లవలసలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక ప్రజలతో టీ తాగి కొద్దిసేపు ముచ్చటించారు.
- ప్రజలు : నిత్యవసర ధరలు పెరిగిపోయాయి. ఏం కొనాలన్నా భయం వేస్తుంది. లారీ ఓనర్లు ప్రస్తుతం రోడ్లపై లారీలు తిప్పాలంటే భయపడుతున్నారు. ఇన్సూరెన్సు రేట్లు పెరిగిపోయాయి. రూ.28 వేలున్న జత టైర్లు ఇప్పుడు రూ. 35 వేలు పెట్టాల్సి వస్తోంది. తెలుగుదేశం టైంలో అప్పు చేసి వ్యాపారం చేసినా లాభాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్తితి పూర్తిగా మారిపోయింది. గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి.
- చంద్రబాబు: ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? మేలు జరుగుతోందా? నష్టం జరుగుతోందా?
- ప్రజలు: రుషికొండలో గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. ఎన్నికలలో నిలబడుతుంటే దాడులు చేస్తున్నారు. మా భూములన్ని లాక్కుంటున్నారు. కరెంటుపోతోంది. మద్యపాన నిషేదం చేయలేదు.
- చంద్రబాబు: రానురాను వైసీపీ ప్రభుత్వం పేదవారిపై పెనుభారం వేస్తోంది. నూనె, పప్పు, ఉప్పు రేట్లు పెరిగిపోయాయి. చెత్తపైన, మరుగుదొడ్లపైన, వీధి దీపాలపైన, డ్రైనేజి పైన, చిన్న హోటల్ కు బోర్డు ఉంటే దానిపై పన్ను ఇలా అన్నింటిపై పన్నులు వేస్తోంది వైసీపీ ప్రభుత్వం. పేదవారిపై నెలకు రూ.12 వేలు అదనపు భారం పడింది.
- ప్రజలు : ఇంటికి రూ.10 వేలు కట్టకపోతే పింఛను తీసేస్తున్నారు. మీరు పండగలకు నిత్యవసర సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి లేవు. పిల్లలు చదువుకునేందుకు కరెంటు కూడా ఉండటం లేదు.
- చంద్రబాబు: మీ పిల్లలు ఎవరైన 10వ తరగతి చదువుతున్నారా? 10వ తరగతి పేపర్లు రోజు లీకౌతున్నాయి. నాడు-నేడు అన్నారు, మీ పిల్లలకు ఇంగ్లీషు నేర్పుతా అన్నారు, కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు తయారైంది రాష్ట్రంలో. పరీక్షా పత్రాలు లీకైతే రేపు ఉద్యోగాలు ఎవరిస్తారు? పక్క రాష్ట్రాల పిల్లలు బాగా ముందుకు పోతున్నారు. పిల్లలు పాస్ కాకపోతే టీచర్ల జీతాలు కట్ చేస్తామని చెప్పారు. అందుకే వారు కూడా పేపర్లు లీక్ చేస్తున్నారు.
- 10 వ తరగతి పిల్లలు : మా పేపర్లన్నీ లీకౌతున్నాయి. మేం కష్టపడి చదివినా ఉపయోగం ఉండేట్లు లేదు. రాత్రుళ్లు చదుకునేటప్పుడు కరెంటు పోతోంది.
Also Read : Chandrababu : రాజధాని కావాలా ? అభివృద్ధి కావాలా? చంద్రబాబు ప్రశ్నకు వచ్చిన రియాక్షన్ ఏమిటంటే ?
Also Read : Babu Rushikonda Tour : రుషికొండకు వెళ్లకుండా చంద్రబాబు అడ్డగింత - అనుమతి లేదన్న పోలీసులు !