దేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా తాళ్ల వలస గ్రామంలో ఆయన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన "బాదుడే బాదుడు" నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో ఏపీ కంటేఇతర రాష్ట్రాల్లో తక్కువ పన్నులు ఉన్నాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని వైఎస్ఆర్‌సీపీ నేతలకు సవాల్ చేశారు. పన్నులతోప్రజల్ని బాదేస్తున్నారని ఇటువంటి  మనం ఎన్నడూ చూడలేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో కల్లా పెట్రోధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు


రుషికొండకు వెళ్లకుండా చంద్రబాబు అడ్డగింత - అనుమతి లేదన్న పోలీసులు !


రాజధాని అంశంపైనా ప్రజల వద్ద నుంచి అభిప్రాయం సేకరించారు.  ‘విశాఖకు అభివృద్ధి కావాలా.. రాజధాని కావాలా’ అని చంద్రబాబు విశాఖ పర్యటనలో స్థానికులను ప్రశ్నించారు. తమకు రాజధాని వద్దని...అభివృద్ధి కావాలని పలువురు ప్రజలు చెప్పారు..అమరావతిని రాజధాని చేసి విశాఖను అభివృద్ధి చేస్తానని ఆ రోజు చెప్పానని గుర్తు చేశారు. విశాఖ అభివృద్ధికే కట్టుబడి ఉన్నానన్నారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్లగలను. నన్ను అడ్డుకుంటే ఖబడ్డార్ అని హెచ్చరించారు.  అత్యాచారాలపై హోంమంత్రి మాటలు బాధ్యతారహిత్యమన్నారు.  టెన్త్ పేపర్ లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.  నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైఎస్ఆర్‌సీపీ  రంగులు వేశారన్నారు. తన పోరాటం తనకోసం కాదని  మీకోసమని ప్రజలకు తెలిపారు.  పెళ్లి అయితే కళ్యాణ కానుక.. పండుగ అయితే పండుగ కానుకఇచ్చామని..టీడీపీ పాలనలో  పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. 


దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఏకగ్రీవం - వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల పదవులు టీడీపీ, జనసేన కైవసం !


తనను రుషికొండకు వెళ్లకుండా అడ్డుకోవడంపై మండిపడ్డారు. ఏ వన్, ఏ టు కలిసి విశాఖ కబ్జాకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  విశాఖపట్నం సుందర ప్రాంతం. ఒకవైపు అందాల కొండ రిషికొండ. విశాఖ జ్ఞాపకాలను చెరిపేందుకు జగన్ కుట్ర చేశారన్నారు.  రుషికొండకు పాకిస్తాన్‌కు ఇచ్చేశారా.. అక్కడికి వెళ్లాలంటే  పాస్‌పోర్ట్ వీసా కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. భూములు, ఖనిజాలు ఎక్కడున్నాయో చూసేందుకే జగన్ పాదయాత్ర చేశారు. జగన్  కన్నుపడితే చాలు ఏదైనా  మాయమవుతుందన్నారు. 


  అమరావతి పనులపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి - ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం !


 .