Visakha Mountain Avalanche Video : విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీ సమీపంలో కొండ ఒక్కసారిగా కిందకు జారిపోయింది. కొండ చరియలు భారీగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిని స్థానికులు వీడియాలు తీశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు. "ఇది ప్రకృతి విపత్తు కాదు. జగన్ మేడ్ డిజాస్టర్. పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో వైసీపీ మైనింగ్ మాఫియా అడ్డగోలు తవ్వకాలతో జారిపోయిన కొండ. ప్రకృతితో పెట్టుకుంటే ఏమవుతుందో జగన్ రెడ్డి గారికి బాగా తెలిసినా మళ్లీ అదే తప్పు చేస్తున్నారు." అని లోకేశ్ ట్వీట్ చేశారు.