Visakha News : విశాఖ శారదాపీఠాన్ని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ శారదా పీఠాన్ని సందర్శించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. రాజశ్యామల అమ్మవారి దర్శనం మరువలేని జ్ఞాపకం అన్నారు. అమ్మవారి అనుగ్రహం హర్యానా ప్రజలపై ఉండాలని కోరుకున్నా అన్నారు. మూడు రోజుల పర్యటన కోసం విశాఖ వచ్చానన్నారు. విశాఖ శారదాపీఠంతో పాటు సింహాచలం అప్పన్న, రుషికొండలో వేంకటేశ్వరస్వామి ఆలయాలను సీఎం సందర్శించారు. మ
"నాచురోపతి పెమా వెల్నెస్ సెంటర్ లో చికిత్స చేయించుకోడానికి విశాఖ వచ్చాను. మూడు రోజులు పర్యటనలో భాగంగా ఇక్కడకు వచ్చాను. విశాఖ చాలా సుందరమైన నగరం. ఇక్కడ శారాదాపీఠం, సింహాచలం, టీటీడీ వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించాను. అంతకు ముందు ఒకసారి ఇక్కడకు వచ్చాను. ఎయిర్ పోర్స్ ఈవెంట్ కు గతంలో హాజరయ్యాయి. విశాఖలో నా పర్యటన చాలా మెమొరబుల్" అని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.