విశాఖలో ఈ నెల 28, 29 తేదీల్లో వైజాగ్ లో జీ -20 సదస్సు జరగనుంది. దీనిలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. జీ-20 దేశాల ప్రతినిధులు చాలా నగరాల్లో ఈ మీటింగ్స్ జరుపుతున్నారు. అందులో భాగంగా విశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సదస్సు జరపనుంది. వైజాగ్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో రెండు రోజుల పాటు ఈ కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. దీనికోసం జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు .
బ్రాండ్ వైజాగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు
జీ -20 సదస్సును బేస్ చేసుకుని వైజాగ్ బ్రాండింగ్ కోసం కష్టపడుతోంది జీవీఎంసీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు వైజాగ్ వాసులను కూడా జీ -20 సదస్సులో పార్ట్నర్లను చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే బోట్ రేసింగ్ , కైట్ ఫెస్టివల్ లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటికే నిర్వహించింది. వీటితోపాటు ఈ వీకెండ్ లో కార్నివాల్ , మారథాన్ లను కూడా జరపనున్నారు. అలాగే వ్యర్ధ పదార్థాలతో కళాఖండాల ఫెస్టివల్ ను కూడా నిర్వహించనున్నారు . వీటిలో పాల్గొనేలా వైజాగ్ వాసులను ఎంకరేజ్ చేస్తుంది జీవీఎంసీ . దీనిని "జన్ భాగిదారీ " ప్రోగ్రామ్ గా పిలుస్తున్నారు.
100 కోట్లతో వైజాగ్ సుందరీకరణ
జీ - 20 సదస్సు నేపథ్యంలో విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారుచేశారు . అలాగే అతిధులు చేరుకునే ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను సరిక్రొత్తగా మార్చేసారు . ఎటుచూసినా అతిధులకు ,ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు . అలాగే సదస్సు జరిగే ఆ రెండు రోజులూ అంటే 28,29 తేదీలలో వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి . దీనికి సహకరించాలి అని పోలీసులు వైజాగ్ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.