Trains Cancelled In Visakha To Vijayawada Routes: ప్రయాణికులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. విశాఖ నుంచి విజయవాడ మధ్య తిరిగే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 11 వరకూ ఈ రైళ్లు రద్దు చేస్తూ రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటించారు. విజయవాడ డివిజన్‌లోని నిడదవోలు - కడియం మధ్య రైల్వే లైన్ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయడంతో ఈ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. 


రద్దైన రైళ్ల వివరాలు



  • ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 10 వరకూ రాజమండ్రి - విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ - రాజమండ్రి ప్యాసింజర్ (07467), గుంటూరు - విశాఖ (17239) సింహాద్రి, విశాఖ - గుంటూరు (17240).

  • అలాగే, విశాఖ - విజయవాడ (12717), విజయవాడ - విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ ప్రెస్.. గుంటూరు - విశాఖ (22702), విశాఖ - గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, విశాఖ - తిరుపతి (22707) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు.

  • ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 10 వరకూ.. మచిలీపట్నం - విశాఖ (17219), విశాఖ - మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్ రద్దైంది. అలాగే, గుంటూరు - రాయగఢ్ (17243), రాయగఢ్ - గుంటూరు (17244), లింగంపల్లి - విశాఖ (12806), విశాఖ - లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేశారు.

  • అటు, ఈ నెల 24 నుంచి ఆగస్ట్ 9 వరకూ తిరుపతి - విశాఖ (22708) డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్ సైతం రద్దైంది.


అయితే, ఎక్కువగా విశాఖ నుంచి విజయవాడ మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.  విశాఖ నుంచి విజయవాడకు ఒకే రోజులో ప్రయాణించే సౌలభ్యం ఉన్న రైళ్లు రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైల్వే అధికారులను కోరుతున్నారు.


Also Read: Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ