YS Jagan : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్లలో తన పర్యటన సందర్భంగా నమోదు అవుతున్న కేసులపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ చెందిన నాయకుడి కుటుంబాన్ని తాను పరార్శించేందుకు లేదని చెప్పడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అందులో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. 

ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిపై కేసులు గురించి కూడా జగన్ స్పందించారు. పుష్ప సినిమాలోని డైలాగ్‌లు చూపించి ప్లకార్డులు పట్టుకుంటే కేసులు పెట్టడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజస్వామ్యమేనా అని అందోళన వ్యక్తం చేశారు. ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తి అసలు ఆ ఫ్లెక్సీ పట్టుకున్న వ్యక్తి గతంలో టీడీపీ తరఫున తిరిగాడని చెప్పుకొచ్చారు. దీంతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

గతంలో టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న కార్యకర్త ఇప్పుడు వైసీపీలో చేరి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని అన్నారు జగన్. ప్రభుత్వం తీరుకు నిరసనగా రప్పారప్పా నరుకుతాం అంటు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే సంతోషమే కదా అన్నారు. టీడీపీ శ్రేణుల్లో కూడా కోపాం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న కోపం వారిలో ఉండటంలో ఆశ్చర్యం లేదని తెలిపారు. అలాంటి ఓ వ్యక్తి వైసీపీలో చేరి ఫ్లెక్సీలు పట్టుకుని తిరుగుతున్నారంటే చంద్రబాబు గుర్తించాలని అన్నారు.