Gudivada News: పెళ్లికి ముందు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో న్యూడ్ కాల్, ఆ వీడియో వరుడి దగ్గరికి - చివరికి ట్విస్ట్

Nude Video Call: ఫేస్‌బుక్‌ లో పరిచయం అయిన వ్యక్తితో ఓ యువతి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. తీరా ఆ విషయం తెలుసుకున్న వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు.

Continues below advertisement

Nude Video Call: సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ఘోరానికి దారి తీస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఫేస్‌బుక్‌ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా పరిచయం పెంచుకుంటారు. తర్వాత వివిధ నేరాల్లో చిక్కుకుంటారు. ఇలాంటి వార్తలు రోజూ వార్తల్లో వస్తూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఓ యువతి చేసిన పని వల్ల తన స్నేహితుడు, బంధువులు, వరుడు, అతడి బంధువులు అంతా పోలీసు కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో అసలేం జరిగిందంటే..

Continues below advertisement

ఫేస్‌బుక్ స్నేహితుడితో యువతి నగ్న వీడియో

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయం న్యూటన్ బాబు అనే వ్యక్తితో చనువుగా ఉండటం మొదలు పెట్టింది. తక్కువ కాలంలోని వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒక రోజు యువతి నగ్నంగా యువకుడికి వీడియో కాల్ చేసింది. ఆ యువకుడు ఆ కాల్ ను రికార్డు చేశాడు. ఈ వీడియోను తన వద్దే పెట్టుకున్నాడు. ఇంతలో ఆ యువతికి ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతి అనే వ్యక్తితో వివాహం నిశ్చయం అయింది. దీంతో యువతి తన కాబోయే భర్త అని అతనితో కూడా శారీరకంగా దగ్గరైంది. ఈ నెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అంతలో న్యూటన్ బాబు తన వద్ద ఉన్న యువతి నగ్న వీడియో కాల్ రికార్డింగ్ ను పెండ్లి కుమారుడు పరంజ్యోతికి పంపించాడు. ఆ వీడియో చూసి షాక్ అయిన పరంజ్యోతి.. ఆ వీడియోను పెళ్లి కుదిర్చిన పెద్దలకు పంపి తన తీరు సరిగ్గా లేదని చెబుతూ పెళ్లి వద్దని చెప్పాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద గుర్రం జాషువా జ్యోతి ఆ వీడియోను యువతి కుటుంబ సభ్యులకు పంపించి పెళ్లి కుమారుడు వివాహానికి నిరాకరించాడని చెప్పాడు. నగ్న వీడియోను న్యూటన్ బాబు తన బంధువులైన బాపట్లకు చెందిన కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ కు పంపించాడు. వాళ్లు ఇంకొందరికి ఆ వీడియోను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: French Man Drugged Wife: ఫ్రాన్స్‌లో షాకింగ్ ఘటన, భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51 మందితో రేప్ చేయించిన భర్త

నగ్న వీడియోలు షేర్ చేసిన వారిపై కేసులు

యువతి నగ్న వీడియోను షేర్ చేసిన వారందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.తులసీధర్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాలు సేకరించి నిందితులపై కేసులు పెట్టినట్లు చెప్పారు. యువతి నగ్న వీడియోను రికార్డు చేసిన న్యూటన్ బాబుపై అత్యాచార యత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు, జాషువా జ్యోతి, కోటేశ్వరరావు, రణధీర్ లపై 109, 120(బి) ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులను గురువారం రోజు కోర్టులో హాజరు పరిచారు. ఎవరివైనా వ్యక్తిగత నగ్న వీడియోలును ఎవరైనా పంపితే వాటిని డిలీట్ చేయకుండా సామాజిక మాధ్యమాల్లో పంపితే వారికి జైలు శిక్ష తప్పదని సీఐ తులసీధర్ హెచ్చరించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా మరిన్ని విషయాలు బయటపడ్డాయని కృష్ణా జిల్లా గుడివాడ టూటౌన్ పోలీసులు తెలిపారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement