Sharmila News: జనవరి 21న బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల- మొదటి టాస్క్ ఏంటీ

PCC Chief Sharmila: మొన్నటి వరకు సొంత పార్టీ నడిపిన షర్మిల...కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Continues below advertisement

AP Congress Chief Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ...రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ (Telangana)లో మొన్నటి వరకు సొంత పార్టీ నడిపిన షర్మిల (Sharmila)...వైఎస్సాఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో...కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించింది పార్టీ అధిష్ఠానం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా, వైసీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే...ఇటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా (PCC Chief Sharmila) 21న షర్మిల బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రెండు వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటంతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. 2019లో జగన్‌ అధికారాన్ని చేపట్టే వరకు....రాజకీయంగా షర్మిల అండగా నిలిచారు. 

Continues below advertisement

షర్మిల ముందున్న సవాళ్లు ఏంటి ?
మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడుతున్న షర్మిల ముందు ఉన్న సవాళ్లు ఏంటి ? అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

1. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం...2. పార్టీకి దూరమైన నేతలను తిరిగి ఆహ్వానించడం...3. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం...4. కేడర్ కు నేనున్నా అంటూ భరోసా కల్పించడం...5. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రానికి చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

నిత్యం కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను పదే పదే చెప్పడం ద్వారా...ప్రజలలో ఆలోచన రెకేత్తించాలి. ఇలా చేయడం ద్వారా జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ కు పునర్ వైభవం వస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పార్టీలో చేర్చుకోవాలి. ప్రత్యర్థులపై విమర్శల దాడి పెంచుతూనే...సొంత పార్టీని బలపరచుకోవాలి. పార్టీని వార్డు స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలి. కింది స్థాయి నుంచి కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయాలి. పదేళ్లుగా పార్టీకి దూరమైన, ఇతర పార్టీల్లో ఉన్న వారిని చేరదీయాలి. 

అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి సవాల్
వైఎస్ షర్మిలకు...అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఆమెకు తొలి సవాల్ ఎదురుకానుంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్...రాష్ట్ర విభజనతో నష్టపోయింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం సంగతి అటుంచితే... కనీసం కౌన్సిలర్లుగా కూడా ఆ పార్టీ తరపున గెలవలేకపోయారు. 2014 ఎన్నికల ఫలితాలే...2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడుంది అనే పరిస్థితి ఏర్పడింది. హస్తం పార్టీలో మహామహులు ఉన్నప్పటికీ... వారంతా వైసీపీలో చేరకుండా సైలెంట్ అయ్యారు. మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, చింతామోహన్, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి వంటి నేతలు...ఏ పార్టీలోనూ చేరలేదు. అలా అని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పలేదు. షర్మిల బాధ్యతలు చేపట్టడంతో వారంతా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.

గతేడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీరారెడ్డి పార్టీ తరపున పని చేశారు. అధికార వైసీపీ, టీడీపీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఆ పార్టీలకు పోటీగా షర్మిల దూకుడుగా వ్యవహరించాలి. తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఛరిష్మాను ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలి. అపుడే అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించే ఛాన్స్ దొరుకుతుంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola