మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి, శ్రీమతి అమ్మాణిల కుమార్తెతో సెప్టెంబర్ 3 వ తేదీన నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈనెల 22వ తేదీన పోరంకిలోని మురళి రిసార్ట్ లో వంగవీటి రాధాకృష్ణ పుష్పవల్లి ల వివాహం 7.59 నిమిషాలకు జరగనుంది.


మరో 14 రోజుల్లో ఆదివారం (అక్టోబరు 22) రాత్రి 7.59 గంటలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నంలో నవ వధువరులు వంగవీటి రాధ, పుష్పవల్లి ఒకటి కానున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన శుభలేఖ వైరల్‌ అవుతుంది. వంగవీటి కుటుంబం అంటే రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. అంతేకాకుండా, రాధా తండ్రి రంగా చనిపోయి ఏళ్లు గడిచినప్పటికి ఆయన్ని అభిమానించేవారు ఎంతో మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి వంగవీటి ఫ్యామిలీ అంటే విపరీతమైన అభిమానం ఉంది. 


వీరి పెళ్లికి వీఐపీల తాకిడి సైతం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో విజయవాడ-నిడమానూరు పోరంకి రోడ్డులోని మురళి రిసార్ట్స్ లో ఈ పెళ్లి వేడుకకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.