విజయవాడలో సోమవారం (అక్టోబరు 9) వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం పదిన్నరకు బయలుదేరతారు. రోడ్డు మార్గాన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొంటారు. రాష్ట్ర నలమూలల నుంచి 8,222 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు, సమన్వయకర్తలు, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనునున్నారు.
CM Jagan: విజయవాడలో వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధుల సమావేశం, హాజరుకానున్న సీఎం జగన్
ABP Desam
Updated at:
08 Oct 2023 11:16 AM (IST)
విజయవాడలోని సోమవారం వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.
సీఎం జగన్