Amit Shah arrives in Vijayawada:
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఏపీ హోం మంత్రి తానేటి వనిత కేంద్ర మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో ఆయనను సత్కరించి, పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షా ఖమ్మం చేరుకున్నారు. బీజేపీ ఖమ్మంలో రైతు గోసం - బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గన్నవరం ఎయిర్ పోర్టులో అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన వారిలో హోం మంత్రితోపాటు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, ఎస్పీ జాషువా, జిల్లా కలెక్టర్ రాజాబాబు, గుడివాడ డివిజన్ ఆర్డిఓ పద్మావతి, డి.ఎస్.పి జయసూర్య, ఎం ఆర్ ఓ నరసింహారావు, రాష్ట్ర బీజేపీ మైనార్టీ మూర్చ అధ్యక్షులు బాజీ, ఆంధ్రప్రదేశ్ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో రైతు గోస - బీజేపీ భరోసా
ఖమ్మం జిల్లాలో నేడు (ఆగస్టు 27న) బీజేపీ పెద్ద ఎత్తున సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. రైతు గోస - బీజేపీ భరోసా పేరిట నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఇదివరకే 115 మంది అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్ అశావహా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించింది.
అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ మరింత సన్నద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్రమంత్రి అమిత్ షా దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో ల్యాండ్ అవుతారు. తర్వాత సభా ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాదాపు 20 మది వరకు ముఖ్య నేతలు ఆ భేటీలో పాల్గొననున్నారని తెలుస్తోంది.