AP Floods News: రేపు ఏపీకి కేంద్ర బృందం, 3 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో పర్యటన

Telugu News: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలైన ఎన్టీఆర్, క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఓ బృందం రానుంది. వీరు సెప్టెంబరు 5న పర్యటించనున్నారు.

Continues below advertisement

AP Latest News: ఏపీ రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో 5వ తేదీ గురువారం కేంద్ర బృందం (ఇంటర్ మినిస్టీరియల్ టీం) పర్యటించనుంది. ఉన్నతాధికారి, కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి (డీయం అండ్ పీయం)  సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో గల కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నేరుగా వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు వరద బాధితులతో నేరుగా మాట్లాడనుంది.

Continues below advertisement

ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీడీఎంఏ) సలహాదారు (OPS&Comn) కల్నల్ కెపి.సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్(CWC) సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాదు ఎస్ఇ(కెసీసీ) యం. రమేశ్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్. గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివియన్ ప్రసన్నలతో కూడిన కేంద్ర బృందం గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లుగా ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Continues below advertisement