Nara Lokesh Condemned implementation of ESMA on Anganwadis: అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. ప్రబత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సీరియస్ అయ్యారు. జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు..


"అమ్మనే గెంటేసినవాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది? పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా? అంగన్వాడీ ఉద్యమంపై సైకో సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణం. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం, సమ్మె కాలానికి వేతనంలో కోత పెట్టడం.. జగన్ నియంత పోకడలకు పరాకాష్ట. 






అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 2 తక్షణమే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. జగన్ అహంకారానికి... అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదే. అంటూ ట్వీట్ చేశారు.