Ambati Rayudu : వైఎస్‌ఆర్‌సీపీకి షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్నారు లీడర్లు. తాజాగా క్రికెట్‌ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. పార్టీలో జాయిన్ అయిన వారం రోజులకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైదొలగుతున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా అంబటి రాయుడు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానంటూ వెల్లడించారు. 


డిసెంబర్‌ 28వ తేదీన పార్టీలో వైసీపీలో చేరారు. సరిగ్గా పది రోజుల్లో పార్టీని వీడుతున్నట్టు తెలపడం సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో వైసీపీ నేతల రాజీనామాలు తరచూ వినిపిస్తున్నాయి. టికెట్ రాదనుకున్న నేతలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు అంబటి రాయుడు రాజీనామా మాత్రం చాలా డిఫరెంట్‌. ఎప్పటి నుంచో ఉన్న నేతలను పార్టీయే వదులుకుందని... జగన్‌ వద్దనుకోవడంతోనే వాళ్లంతా రాజీనామాలు చేస్తున్నారి సమర్థించుకోవచ్చు. కానీ అంబటి రాయుడు రాజీనామాను మాత్రం ఎలా సమర్థించుకుంటారో చూడాలి. కనీసం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఒక్కసారైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా జాయిన్  అయిన పది రోజులకే ఇలా రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారుతోంది.