Euphoria Musical Night: 'ఎన్టీఆర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం' - రాగాలు రోగాలు నయం చేస్తాయన్న బాలకృష్ణ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా 'యుఫోరియా మ్యూజికల్ నైట్'

Vijayawada News: తలసేమియా బాధితులక సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'యుఫోరియా మ్యూజికల్ ఈవెంట్' విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈవెంట్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరయ్యారు.

Continues below advertisement

NTR Trust Euphoria Musical Night In Vijayawada: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని (Vijayawada) ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 'యుఫోరియా మ్యూజికల్ నైట్' (Euphoria Musical Night) ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కాన్సర్ట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawankalyan), నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి లోకేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం చంద్రబాబు (CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి సాదరంగా ఆహ్వానించారు. తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు 'యుఫోరియా ఈవెంట్'ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‍‌లో టికెట్ కోసం పెట్టే ప్రతీ రూపాయి తలసేమియా బాధితులకు వెళ్తుందని భువనేశ్వరి స్పష్టం చేశారు. తలసేమియా బాధితుల సహాయం కోసం ఫండ్ రైజింగ్ కోసమే మ్యూజికల్ నైట్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Continues below advertisement

'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా బాలకృష్ణ (Balakrishna) అన్నారు. 'నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, విద్యాలయాలు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నా. హైదరాబాద్ బసవతారకం క్యానర్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ అంకాలజీ వార్డును ఈ రోజు ప్రారంభించాం. రోగులకి చికిత్స అందించడానికి అత్యాధునిక వసతులు ఏర్పాటు చేశాం. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో తలసేమియాతో బాధపడే చిన్నారుల సంఖ్య ఎక్కువ. హైదరాబాద్‌లో దాదాపు 3,500 మంది బాధితులు ఉన్నారు. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా 250 మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఈ సేవలను విస్తరించేందుకు 25 పడకలకు పెంచుతున్నాం. ఏపీ రాజధాని అమరావతిలోనూ తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నాం. ఇందుకు మీ అందరి సహకారం అవసరం.' అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Also Read: రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టి 'క్లీంకార'ను చూశారా?... దాచాలని ట్రై చేసినా ఫేస్ రివీల్ అయ్యిందిగా

'రాగాలు రోగాలు నయం చేస్తాయి'

కొన్ని రాగాలు రోగాలు నయం చేస్తాయని.. యుఫోరియా మ్యూజికల్ నైట్‌లో తమన్ చక్కటి వినోదాన్ని అందిస్తారని బాలకృష్ణ అన్నారు. 'సరిగమపదనిస సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి ధనిక, పేద, కుల, మత భేదాలు లేవు. అడ్డుగోడలు ఉండవు. పురాణాల్లోనూ ఇందుకు ఉదాహరణలు ఉన్నాయి. ఇంతమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న డాకును అయినందుకు సంతోషంగా ఉంది. తమన్‌కు నందమూరి ఇంటి పేరును ఆపాదించి, మా సోదరుల్లో ఒకరిగా గౌరవించినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము చేస్తోన్న సేవలకు స్పందించి సహాయ సహకారాలను అందించడానికి వచ్చిన ప్రజలకు, ప్రేక్షకులకు పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు' తెలిపారు.

Also Read: 'వ్యక్తిగత పరిచయంతో వైసీపీ నేతలకు ప్రచారం' - ఆ కారణంతో చాలా కోల్పోయాను, సింగర్ మంగ్లీ బహిరంగ లేఖ

Continues below advertisement