Ram Charan Upasana's Daughter Klinkaara Face Reveal: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసనల గారాలపట్టి, మెగా వారసురాలు క్లీంకార (Klinkaara). దాదాపు ఏడాదిన్నర దాటినా వీరిద్దరూ కూడా చిన్నారి ఫేస్ ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఉపాసన ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ ఫోటోస్ షేర్ చేసినా 'క్లీంకార' ఫేస్‌ను మాత్రం ఎమోజీస్‌తో మేనేజ్ చేసేవారు. రామ్ చరణ్, ఉపాసన 'క్లీంకార'తో ఎప్పుడు బయటకొచ్చినా మీడియా కెమెరాలన్నీ వీరి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా క్లీంకారను చూపించేందుకు తాపత్రయపడుతుంటాయి. ఎంత ప్రయత్నించినా చిన్నారి ఫేస్ మాత్రం చూపించలేకపోయాయి. ఇక, తాజాగా తిరుమలలో క్లీంకార ఫేస్ మొత్తం రివీల్ అయ్యింది. రామ్ చరణ్ తన బిడ్డను ఎయిర్‌పోర్టులో ఎత్తుకుని కనిపించాడు. చెకింగ్ వద్ద తండ్రీకూతుళ్లు ఇలా కనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఓ చిన్న వెకేషన్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఎంత క్యూట్‌గా ఉందో..

ఎంత రివీల్ చేయకూడదని అనుకున్నా.. 'క్లీంకార'ను అధికారికంగా చూపించక ముందే మొత్తానికి ఎయిర్‌పోర్టులో ఫేస్ రివీల్ అయిపోయింది. చేతిలో ఫోన్ ఉండడంతో ఎక్కడ ఏది కనిపించినా అందరూ క్లిక్ మనిపించేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తాజాగా ఫ్యామిలీతో సహా కనిపించగా వారి గారాలపట్టిని సైతం వీడియోలో బంధించేశారు. దీన్ని చూసిన నెటిజన్లు 'క్లీంకార' ఎంత క్యూట్‌గా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనలు మరి అధికారికంగా మెగా వారసురాలి ఫోటోను ఎప్పుడూ రివీల్ చేస్తారో చూడాలి. కాగా.. క్లీంకారపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఇప్పటివరకూ చిన్నారి ఫేస్ రివీల్ చేసేందుకు రామ్ చరణ్, ఉపాసనలు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అలా ఎక్కువగా బయటకు వస్తే.. క్లీంకారకు ప్రైవసీ పోతుందని.. స్కూల్‌కు వెళ్లినా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. అటు.. 'క్లీంకార ఎప్పుడైతే తనను నాన్న అని పిలుస్తుందో అప్పుడే చూపిస్తాను' అంటూ రామ్ చరణ్ ఇటీవలే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఎంత ప్రైవసీగా ఉండాలనుకున్నా 'క్లీంకార' ఫేస్ రివీల్ అయిపోయింది.

Also Read: కుక్కర్ గొడవ నుంచి యష్మి - నిఖిల్ - గౌతమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరకు... శ్రీముఖి ట్రోలింగ్ మామూలుగా లేదుగా

కాగా, 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ తర్వాత రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'RC16' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో చెర్రీ బర్త్ డే రోజున ఓ స్పెషల్ సర్‌ప్రైజ్‌గా మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న మెగా అభిమానులకు ట్రీట్‌గా ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తారని సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రాబోయే ఈ సినిమాకు మేకర్స్ ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశారనే దానిపై ఆసక్తి నెలకొంది.

Also Read: ఓటీటీలోకి దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్... తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?