East Godavari MLC Elections : ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూట్నీలో అక్రమాలు జరిగాయని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీ‌రాజ్‌ ఆరోపిస్తున్నారు. కూటమి నాయకత్వానికి అధికారులు కొమ్ముస్తున్నారని విమర్శించారు. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన తన సోదరుడు, స్వతంత్ర అభ్యర్ధి జీవీ సుందర్‌ పేరు కావాలనే 43వ స్థానంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నామినేషన్ రిజెక్ట్ అయినా తీసుకున్నారు: జీవీ శ్రీ‌రాజ్‌

కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌ నామినేషన్‌ ముందు రిజెక్ట్‌ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు జీవీ శ్రీ‌రాజ్‌. ఆ నామినేషన్‌ను ఎలా స్వీకరించారని అధికారులను ప్రశ్నించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రూల్స్‌ను అతిక్రమిస్తున్నారని అన్నారు. ఓటర్లును ప్రలోభపెడుతున్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. దీనికి సంబంధించిన వాట్సాప్‌ చాటింగ్‌ చూపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామని, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అధికారులే రూల్స్‌ అతిక్రమిస్తున్నారు..

ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అభ్యర్థులు అతిక్రమించడం తప్పని అయితే ఇక్కడ అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని జీవీ శ్రీ‌రాజ్ ఆరోపించారు. స్క్రూట్నీ విష‌యంలో 11 మంది నామినేష‌న్లు తిర‌స్క‌రించ‌డంలో లోపాలున్నాయ‌న్నారు. ఎల‌క్ష‌న్ ప్రొసిజ‌ర్‌లో గ‌డువు పూర్త‌య్యాక అఫ‌డ‌విట్ క‌రెక్ట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించార‌ని అన్నారు. కూట‌మి అభ్య‌ర్థ‌కి అవ‌కాశం ఎలా క‌ల్పించార‌ని ప్ర‌శ్నించారు. దీనికి క‌లెక్ట‌ర్‌, ఆర్వో బాధ్యత వ‌హించాల‌న్నారు. క‌లెక్ట‌రు అవ‌లంభించిన తీరు బాధాక‌ర‌మ‌న్నారు.. 

కూట‌మి అభ్య‌ర్ధికి వత్తాసు: జీవీ శ్రీ‌రాజ్‌కూట‌మి అభ్య‌ర్థి అఫ‌డ‌విట్‌లో లోపాలున్నా కూడా నామినేషన్ తిరస్కరించకుండా లోపాలు స‌రిదిద్దుకునే ఛాన్సస్ ఇచ్చారన్నారు జీవీ శ్రీ‌రాజ్‌. 11 మంది అభ్య‌ర్థ‌లు విష‌యంలో కూడా లోపాలు కచ్చితంగా ఉన్నాయ‌న్నారు. ఇది కేవ‌లం రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారన్నది వాస్త‌వం అన్నారు. కూట‌మి అభ్య‌ర్థి నామినేష‌న్ సెట్‌లో అఫ‌డ‌విట్ లోపాలున్నాయ‌ని, దానిని తిరస్కరించేందుకు ఆధారాలున్నాయ‌న్నారు. 

Also Read: సైకిల్ ఎక్కిన మాజీ మంత్రి ఆళ్ల నాని- చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

జీవీ సుంద‌ర్‌ను ఆఖ‌రికి నెట్టారు.. : జీవీ శ్రీ‌రాజ్‌

వ‌రుస సంఖ్య విష‌యంలో త‌న సోద‌రుడు జీవీ సుంద‌ర్‌ను వెన‌క్కునెట్టార‌న్నారు జీవీ శ్రీ‌రాజ్‌. కావాల‌నే జీవీ సుంద‌ర్ పేరును లైట్‌గా ఫ్రింట్ చేశార‌ని ఆరోపించారు. ఓట‌ర్ల‌కు ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని, డ‌బ్బులు కూడా పంపిస్తున్నార‌ని, బ‌స్సు టిక్కెట్లకు డ‌బ్బులు పంపిస్తున్నార‌ని ఆరోపించారు. కూట‌మి అభ్య‌ర్థిని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. దీనిపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఇప్ప‌టికే ఫిర్యాదు చేశామ‌ని, కోర్టుకు కూడా వెళ్తామ‌న్నారు. 

కూట‌మి అభ్య‌ర్ధికి చెమ‌టలు ప‌డుతున్నాయి..: జీవీ శ్రీ‌రాజ్‌

త‌న సోద‌రుడు అభ్య‌ర్ధిగా రంగంలోకి దిగిన వెంట‌నే కూట‌మి అభ్య‌ర్ధికి, కూట‌మి నేత‌ల‌కు చెమ‌టలు ప‌డుతున్నాయ‌ని జీవీ శ్రీ‌రాజ్ అన్నారు. హ‌ర్ష‌కుమార్ త‌న‌యుడుగా జీవీ సుంద‌ర్ ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించ‌బోతున్నార‌ని అన్నారు. స‌జావుగా ఎన్నిక‌లు జ‌రిగితే త‌న సోద‌రుడే గెలుస్తాడ‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు. 

Also Read: బర్డ్‌ఫ్లూతో పెరిగిన ఖర్చు- చికెన్ ప్లేస్‌లో మటన్‌, ఫిష్‌ చేరడంతో జనం గగ్గోలు