అమరావతి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ నిరాధారమని ఏపీ పోలీసులు తెలిపారు. కోల్ కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిరాధారమైనవని వెల్లడించారు. కొడాలి నాని అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటిస్తామని పోలీసులు తెలిపారు. కొడాలి నానిపై రాష్ట్రంలో కేసు నమోదు అయిన నేపథ్యంలో ఆయన్ను కోల్‌కతా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈ ఉదయం నుంచి వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఏపీ పోలీసులు స్పందించారు.
కాగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంగళవారం నాడు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు వెళ్లిన సిట్ అధికారులు చెవిరెడ్డిని, ఆయన సన్నిహితుడ్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరు పరచనున్నారు.