Special Trains: రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే  వివిధ గమ్యస్థానాల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించింది.  ఆ రెండు గమ్య స్థానాల వివరాలు ఇవే.

Continues below advertisement

క్ర.సం రైలు నం ఎక్కడి నుంచి ఎక్కడికి సేవలు అందించే రోజు పొడిగించిన కాలం సర్వీసుల సంఖ్య
1   07637 తిరుపతి సాయి నగర్ షిర్డీ ఆదివారం (Sun) 30.11.2025 నుంచి 28.12.2025 వరకు 05
2 07638 సాయి నగర్ షిర్డీ తిరుపతి సోమవారం (Mon) 01.12.2025 నుంచి 29.12.2025 వరకు 05

రైలు నంబర్ 07637 -  తిరుపతి నుంచి సాయి నగర్ షిర్డీ వరకు నడిచే ఈ ప్రత్యేక రైలు సర్వీసు ఆదివారం రోజున  నడుస్తుంది. ఈ సర్వీసులు 30.11.2025 నుంచి 28.12.2025 వరకు పొడిగించాలని  దక్షిణ మధ్య రైల్వే  నిర్ణయించింది.  ఈ సర్వీసు మొత్తం ఐదు (05) ట్రిప్పులుగా నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.  

రైలు నంబర్ 07638 -  సాయి నగర్ షిర్డీ నుంచి తిరుపతి వరకు నడిచే ఈ రైలు సర్వీసు సోమవారం రోజున నడుస్తుంది. దీని పొడిగింపు కాలం 01.12.2025 నుంచి 29.12.2025 వరకు ఉంది, ఈ రైలు  కూడా ఐదు (05) ట్రిప్పులు తిరగనుంది. 

Continues below advertisement

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పండుగలు, సెలవు దినాల్లో ప్రయాణించాలనుకునే వారికి ఈ రెండు సర్వీసులు సౌకర్యవంతంగా ఉంటాయి.