Vijayawada Tiranga Rally: ఉగ్రవాదంపై ఉక్కపాదం మోపి పాకిస్థాన్‌ను వణికించినందుకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శౌర్య తిరంగ యాత్ర ఘనంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్‌ పురేందేశ్వరితోపాటు మంత్రులు కూటమిలోని ఇతర నాయకులు హాజరయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబూని సూమారు మూడు కిలోమీటర్లు నడిచారు. ఆద్యంతం జాతీయ భావం వెల్లివిరియగా.. వేలమంది నగర ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని భారత ఆర్మీ శౌర్యాన్ని కీర్తించారు. భారత్ మాతా కీ జై అని నినదిస్తూ ముందుకి కదలారు. బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం నేతలు మాట్లాడారు. 

ఆ మాట అంటేనే కోపం వస్తుంది: చంద్రబాబు

ఉగ్రవాదంపై పోరులో సైనికులు పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేయాల్సిందేనని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పాక్‌ కాల్పుల్లో వీర మరణం పొందిన మురళీనాయక్‌ త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు చంద్రబాబు. పహల్గాం అంటేనే అంటేనే పాకిస్థాన్ ఖబర్దార్ అనేలా కోపం వస్తుందని అన్నారు. అలాంటి కోపాన్ని ఆపరేషన్ సిందూర్ పేరుతో కేంద్రం సైనిక చర్య చేపట్టి విజయం సాధించిందన్నారు. అందుకే తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళల సిందూరు తుడిస్తే ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో గట్టిగా బుద్ది చెప్పారని సైన్యాన్ని అభినందించారు.       పాకిస్థాన్ ఇంటికెళ్లి కొట్టం: పవన్ ‘భారత దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి దాడులకు పాల్పడుతోంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 1947లో దేశ విభజన జరిగిన నాటి నుంచి దేశం ఏనాడు ప్రశాంతత చూసింది లేదన్నారు. శాంతి.. శాంతి అంటూ వల్లించే శాంతి వచనాలు వారికి పని చేయవన్నారు. ఇప్పటి వరకు సహనంతో చేతులు కట్టేశారు. ఇక పాకిస్థాన్ ఆటలు సాగవన్నారు. మీరు మా దేశంలోకి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి వచ్చి కొడతామని హెచ్చరించారు.  

"కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి 72 గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం. ముంబయి పేలుళ్లు, కోయంబత్తూరు పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు, జామా మసీదు పేలుళ్లు, లుంబనీపార్కు పేలుళ్లు వీటన్నింటి వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది." అని అన్నారు. 

సెలబ్రిటీలు దేశాన్ని నడపరు... "జయవాడ నడిబొడ్డున కూర్చుని మాట్లాడుతున్నామంటే అది సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారన్న ధైర్యమే. అదే సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, హర్యానా... అక్కడ ఇంత ప్రశాంతత ఉండదు. మన దేశానికి మనం చేయగలిగింది ఒకటే. సైన్యానికి మనం అండగా ఉన్నాం అని ధైర్యం చెప్పడమే. దేశం లోపల ఉన్న సూడో సెక్యులరిస్టులు సెక్యులరిజం ముసుగులో దేశ సైన్యాన్ని బలహీనపరిచే విధంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నోరు మూయించడం అందరి కర్తవ్యం. మన సైన్యం కోసం మనం బలంగా నిలబడాలి." 

" మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రాడు. భారత్ మాతాకీ జై చెప్పారు. అటువంటి వారే నిజమైన దేశ భక్తులు. సెలబ్రిటీలు, హీరోలు ఎవరూ మాట్లాడడం లేదు అంటే వారెవరూ దేశాన్ని నడిపేవారు కాదు. వారు వినోదాన్ని పంచే వారు మాత్రమే.. సెలబ్రటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి. దేశభక్తుడు అంటే మురళీ నాయక్ లాంటి వారు. మరణిస్తే దేశాన్ని కాపాడుతూ సైనికుడిగా పోవాలి అనుకున్నారు. అతని తల్లిదండ్రులకు ఏం చెప్పగలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ అమర్ హై.." Dvf అన్నారు.