టెన్త్‌పేపర్ల లీకేజీపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇప్పటి వరకు 69 మందిపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. వీరిలో 36 మంది ప్రభుత్వం ఉపాధ్యాయులే ఉన్నారని తెలిపారు. దొరికిన వీరంతా పేపర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫొటోలు తీసుకుని బయటకు పంపారు. ఉయ్యూరులో జవాబులు తయారు చేస్తుండగా ఐదుగురు టీచర్లను పట్టుకున్నారు. ఆన్సర్లు తయారు చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. గతంలో లాగా డబ్బులు ఆశ చూపెట్టి ముందుగా లీకులు చేయటం లాంటిది జరగలేదన్నారు బొత్స. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. 


టెన్త్ పేపర్ లీకుల విషయంలో నారాయణ, చైతన్య, కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ తదితర అక్రమాలకు పాల్పడిన వాటిపై తీసుకుంటామన్నారు బొత్స. అవసరమైతే ఆ స్కూళ్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామనని హెచ్చరించారు. పరీక్షలు అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడదామన్నారు. లోకేష్ ఆరోపణలు చీప్‌గా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అతనికి పట్టదా?అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 


ఈ నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా పకడ్బందీగా జరుగుతాయన్నారు బొత్స సత్యనారాయణ.  దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశామని... అవసరమైతే రూములలో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నామన్నారు.