AP Governor Discharged from Manipal Hospital: అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రెండు రోజుల కిందట అస్వస్థతకు గురయ్యారు. మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లు ఆయనకు అపెండెక్టమీ సైతం రోబో సాయంతో నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండగా, ఆస్పత్రి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ మేరకు మణిపాల్ హాస్పిట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపుడి తాజా హెల్త్ బులెటిన్ లో తెలిపారు.