TDP Leaders on AP CM: అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు తాము నిర్ణయించుకున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. జూమ్‌ ద్వారా తెదేపా శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొన్న తర్వాత ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అక్రమాలే జరగని కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణం అన్నారు. కావాలనే.. కక్షతో బాబును జైల్లో పెట్టారని దీనిని బట్టి వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో చాలా బాగా అర్థం అవుతుందని అన్నారు.


2004 సంవత్సరం నుంచి సీఎం జగన్ చేసిన అక్రమార్జనపై సభలో వాస్తవాలు చెబుతామంటూ వ్యాఖ్యానించారు. చేసిన తప్పులకు ముఖ్యమంత్రి జగన్ జన్మజన్మలకూ బాధ పడతారని చిన రాజప్ప చెప్పుకొచ్చారు. సొంత డబ్బా కొట్టుకునేందుకు జగన్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన పోరాడడంతో పాటుగా చంద్రబాబు అరస్టును తీవ్రంగా ఖండిస్తామన్నారు. అలాగే బాబు అరెస్టు అక్రమం అనే ప్రధాన అజెండాతో తాము హాజరవుతున్నట్లు చెప్పారు. 


మరోవైపు బాబు అరెస్టుపై స్పందిస్తున్న సినిమా స్టార్లు


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు   ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం పై అభిమానులు, ఐటీ ఉద్యోగులు, పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు స్పదించగా.. అటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు పోరాటయోధుడని.. త్వరలోనే బయటకు వచ్చి మళ్లీ  యాక్టివ్ అవుతారన్నరు.   విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’   చిత్రం  తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.   హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విశాల్ కూడా హాజరయ్యాడు. ఇక ఈ కార్యక్రమంలో విశాల్ చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.


తెలుగుచిత్ర సీమలో ఇతర పెద్దలు పెద్దగా స్పందించలేదు.   తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని నిర్మాత దుగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు.  అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన  ఉండదన్నారు.  తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదని గుర్తు చేశారు.   రాఘవేంద్రరావు, అశ్వనీదత్,  కేఎస్ రామారావు, నట్టికుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌లు స్పందించారు. చంద్రబాబు నాయుడు పోరాట మోధుడు అని ఆయనను అక్రమ కేసులు ఏమీ చేయలేదని రాఘవేంద్రరావు అన్నారు.  ‘శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు’ అని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. 


Read Also: Vishal : చంద్రబాబు అరెస్ట్ భయమేసేలా చేసింది - హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు !