AP EX minister Kodali Nani sensational comments on Tirumala Laddu Controversy | తాడేపల్లి: తిరుమలలో లడ్డూ పవిత్రతను దెబ్బతీసింది సీఎం చంద్రబాబు అని, రాజకీయ లబ్ది కోసం కల్తీ నెయ్యి పేరుతో చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన తరహాలోనే టెండర్లకు పిలిచి వైసీపీ పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. తాడేపల్లిలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సీఎంగా ఉన్న సమయంలో 18 సార్లు నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపినట్లు తెలిపారు. ప్రతి వాహనాన్ని చెక్ చేసి, లోపాలు ఉంటే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించామన్నారు. జగన్ సీఎంగా ఉన్నా, చంద్రబాబు సీఎంగా ఉన్నా క్వాలిటీ లేకుంటే వెనక్కి పంపాల్సి ఉంటుందన్నారు.
జులై 17 వరకు ఆహార తినుబండారాలు కాంట్రాక్టర్లు నెయ్యిని సప్లై చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే క్వాలిటీ లేదని నెయ్యిని వెనక్కి పంపించారు. ఆ నెయ్యిని ఎక్కడా వాడలేదు. ఇలాంటివి ఎప్పుడూ వాడరని కొడాలి నాని తెలిపారు. కానీ చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం జంతువుల కొవ్వు కలిసింది, వాటితో లడ్డూ ప్రసాదాలు తయారుచేసి భక్తులకు ఇచ్చారని దుష్ప్రచారం చేశారని విమర్శించారు.
చంద్రబాబు ఎన్నిసార్లు తలనీలాలు అర్పించారు..
కొడాలి నాని ఇంకా మాట్లాడుతూ.. ‘ఏ ప్రభుత్వం అయినా సరే తిరుమలకు వచ్చే నెయ్యిలో కల్తీవి వస్తుంటాయి. అయితే పరీక్షించిన తరువాత కల్తీ నెయ్యిని వెనక్కి తిప్పి పంపడం సర్వసహజం. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ట, వైభవం కలిగిన తిరుమల ఆలయంలో అన్నం తినేవాడు ఎవడైనా ఇలా దుష్ప్రచారం చేస్తారా. నా వయసు 50 ఏళ్లు. 40 సార్లు తిరుమలకు వెళ్లా. 20 సార్లు గుండు కొట్టించుకున్న. 15 సార్లు కింద నుంచి కొండ మీదకు నడిచి వెళ్లాను. చంద్రబాబు తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుడా. రాజకీయాలకు స్వామి వారిని, భక్తులను వాడుకుంటున్నారు. అయితే చంద్రబాబు ఇప్పటివరకు తిరుమలకు వెళ్లి ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించారు. మహిళలు కూడా తిరుమలకు వెళ్లి స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు.
సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం
తిరుమల వివాదంపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని సైతం కోరాం. కానీ చంద్రబాబు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై సిట్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు కూర్చోమంటున్నారు. నిల్చోమంటో నిల్చుంటారు సిట్ అంటే అదేనా. లోకేష్, చంద్రబాబు వద్దకు వెళ్లి వాళ్లు ఏం చెబితే అది రిపోర్టు చేస్తారు. చంద్రబాబు మక్కెలిరకగొడతా అంటున్నాడు. కాకినాడ ఎమ్మెల్యే ఓ ప్రొఫెసర్ ను కొట్టాడు. ఆయన మక్కెలిరగకొట్టావా. చంద్రబాబు చేసిన పాపానికి శిక్ష వేయాల్సి వస్తే దేవుడు ఆయనకు శిక్ష వేయాలి. అంతేగానీ భక్తుల్ని కాపాడాలని స్వామివారిని కోరుతున్నాను. చంద్రబాబు ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలి. లేకపోతే దేవుడు పెద్ద శిక్ష వేస్తాడు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని.. ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేయాలని’ సూచించారు.
Also Read: YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్