పల్నాడు హీటెక్కి ఉంది. తమ పార్టీ కార్యకర్త హత్యతో రగిలిపోతున్న టీడీపీ... ఆందోళనలు నిరసనలు అంటూ రోడ్డుపై నినాదాలు చేస్తోంది. అదే స్థాయిలో వైఎస్‌ఆర్‌సీపీ కూడా రివర్స్‌ అటాక్ మొదలు పెట్టింది. ఇలా రెండు పార్టీల రాజకీయ ఎత్తుగడలతో పల్నాడు రాజకీయం పోటెత్తుతోంది. 


ఇలా పొలిటికల్ హీట్‌ పీక్స్‌లో ఉన్న టైంలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పల్నాడు టూర్‌ షెడ్యూల్ అయింది. మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్న జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను సీఎంవో అధికారులు ప్రకటించారు. 


సీఎం అదనపు కార్యదర్శి కె. నాగేశ్వర్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి గుంటూరు చేరుకుంటారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో హెలికాప్టర్ దిగుతుంది. అక్కడే వైఎస్‌ఆర్‌ యాత్ర పథకాన్ని ప్రారంభించారు. 


ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండ వీడు చేరుకుంటారు. అక్కడ జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి మళ్లీ తాడేపల్లి చేరుకుంటారు.