బెజవాడలో పట్టపగలు మరో దారుణం వెలుగు చూసింది. ఇంటికి పక్కనే నివాసం ఉంటున్న బాలికపై కన్నేసిన 48ఏళ్ళ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. బాలిక నోట్లో దుస్తులు పెట్టి మరి లైంగికంగా హింసించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.
బెజవాడలో 9 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. అత్యాచారనికి పాల్పడ్డ 48 ఏళ్ల ఆఫీజ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. 9 సంవత్సరాల వయస్సు గల బాలిక నివాసం ఉంటున్న పక్కింటిలోనే ఆఫీజ్ కూడా నివాసం ఉంటున్నాడు. చిన్నారి ఇంటి పక్కనే ఒంటరిగా ఉంటున్న సమయంలో ఆఫీజ్ మాయ మాటలు చెప్పి నోట్లో దుస్తులు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు లేని సమయంలో బాలికను ఏమార్చి తన ఇంటిలోకి తీసుకువెళ్లి హింసించాడు. తరువాత విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులు చెప్పడంతో స్థానికులు హఫీజ్‌ను నిలదీశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని బుకాయించడంతో అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి కొత్తపేట పోలీసులకు అప్పగించారు. పోలీసులు నుంచి కూడా ఆఫీజ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు బందించి,స్దానిక దిశ పోలీసులకు అప్పగిచారు. దిశ పోలీసుల నుంచి కూడా ఆఫీజ్ ఎస్కేప్ అయ్యేందుకు యత్నించాడు. పోలీసులు తమదైన స్టైల్‌లో బంధించారు.
విచారణలో జాప్యం
బాలిక పై అత్యాచారం ఘటన వెలుగు చూసిన తరువాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు ఆఫీజ్ ను పట్టుకొని మరీ అప్పగించారు. కేసు నమోదు విషయంలో పోలీసులు జాప్యం చేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడితో బాధితురాలి కుటుంబ సభ్యులకు మధ్య రాజీకి కుదిర్చేందుకు ప్రయత్నించారని స్దానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులపై విమర్శలు వ్యక్తం అవటంతో అర్థరాత్రి తరువాత కేసు నమెదు చేశారని అంటున్నారు.
రాజకీయ పార్టిల ఆందోళనలు...
బాలికపై అత్యాచార ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు కేసు నమోదు చేసేందుకు జాప్యం చేశారనే విమర్శలు వ్యక్తం అవటంతో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. బాధితురాలి తండ్రి వైసీపీ నాయకుడు అయినప్పటికి పోలీసులు, పార్టీ నాయకులు సరిగా స్పందించలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని బాధితురాలి తండ్రే స్వయంగా జనసేన నేత ముందు ఆవేదన వ్యక్తం చేసుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియా గ్రూపుల్లో తిరుగుతోంది. జనసేన నాయకులు బాదితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
తెలుగు మహిళల ఆందోళన...
బాలిక పై అత్యాచారం ఘటనపై తెలుగు మహిళలు ఆందోళనకు దిగారు. బాధితురాలికి న్యాయంచేయాలని, రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యారాలను నిరోధించటంలో ప్రభుత్వం విఫలం అవుతుందని ఆరోపించారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో బాలిక చికిత్స పొందటంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, అత్యాచారం జరిగితే రాజీ చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. దిశ చట్టం అమలుపై ప్రచారాలు తప్ప ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయటం లేదని తెలుగు మహిళలు విమర్శించారు. పోలీసుల తీరు,ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.