Vijayawada Teppotsavam : ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి నదీ విహారానికి ఈ ఏడాది కూడా బ్రేక్ పడింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి వరదనీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి అధికంగా చేరుకోవడంతో తెప్పోత్సవం నిర్వహించలేకపోతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, రివర్ కన్జర్వేటర్ కృష్ణారావు వెల్లడించారు. నది ఒడ్డున గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. దుర్గామల్లేశ్వరస్వామి తెప్పోత్సవ నిర్వహణపై సందిగ్ధత వీడింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల నిండుకుండల్లా మారాయని ప్రకాశం బ్యారేజీ వద్ద లక్ష క్యూసెక్కుల నీటిని 70 గేట్లు ఎత్తి కిందకు వదులుతున్నామని కలెక్టర్ చెప్పారు. తెప్పోత్సవం నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవన్నారు. వరుసగా మూడో ఏడాది కూడా తెప్పోత్సవం నిర్వహించలేకపోతున్నామన్నారు. 10 వేల క్యూసెక్కుల నీటి నిల్వ ఉంటేనే నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. నది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని కలెక్టర్ చెప్పారు.
నదీ విహారానికి బ్రేక్
ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది నదీ విహారానికి బ్రేక్ పడింది. నది ఒడ్డునే హంస వాహనం ఉంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతోనే నదీ విహారం సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్‌కు నివేదిక పంపింది. దీనిపై కలెక్టర్ ఢిల్లీరావు, ఇరిగేషన్ అధికారి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు.
దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!
దుర్గాఘాట్ లో హంస వాహనం సేవ
కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించడం సాధ్యంకాదని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతోందన్నారు. మూడు రోజులుగా కృష్ణానదిలో ప్రవాహం కొనసాగుతున్నందున దుర్గామల్లేశ్వరస్వామి వార్ల నదీ విహారం నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. దుర్గాఘాట్‌లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. పూజా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తుల కోసం ప్రకాశం బ్యారేజీ, పున్నమిఘాట్, ఫ్లై ఓవర్, దుర్గాఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలమంది వస్తారని, కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు.
Also Read : Chandrababu In Unstoppable Show:- బాలయ్య అన్‌స్టాపబుల్- 2కు ఫస్ట్ గెస్ట్‌గా చంద్రబాబు!