Vijayawada Pipe leak: స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీకవడంతో చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ పైప్ లీకవడంతో చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 11వ తేదీన ఏలూరులో జరిగే అండర్ 14 అండర్ 17 స్విమ్మింగ్ పోటీలకు ఇక్కడే ఔత్సాహిక స్విమర్లు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 7 వ తేదీ సాయంత్రం నగరపాలక సంస్థ ఆధీనంలోని స్విమ్మింగ్ పూల్ లో కోచ్,....పిల్లలు తల్లిదండ్రులతో స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో శిక్షణ ఇస్తున్నారు. అదే సమయంలో ... క్లోరినేషన్ కోసం సిబ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. స్విమ్మర్లంతా వెళ్ళిపోయాక క్లోరిన్ కలిపేందుకు ఎదురుచూస్తున్నారు. ఇంతలో క్లోరిన్ పైపు లీక్ కావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈత నేర్చుకుంటున్న చిన్నారులంతా క్లోరిన్ తీవ్రతకు అస్వస్థతకు గురి అయ్యారు. దాదాపు పదిమంది క్లోరిన్ వాసన పీల్చి గొంతు నొప్పి తోను ఊపిరి అందని పరిస్థితికి లోనయ్యారు. కొందరు దగ్గు, వాంతులు కూడా చేసుకున్నారు. వీరందరినీ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో క్రమంగా కోలుకున్నారు.
గతంలోనూ
క్లోరిన్ ట్యాంకు నుంచి స్విమ్మింగ్ పూల్లోకి క్లోరిన్ కలిపే పైపు లీకవడం వల్ల ఈ ఘటన జరిగిట్లు తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. చిన్నపాటి సమస్యలతో అందరూ కోల్పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్విమ్మింగ్ పూల్ లో ఈ తరహా ఘటనలు జరగడం కొత్తేమీ కాదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో క్లోరినేషన్ జరుగుతున్న సమయంలో పైప్ లీకై స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలోని మొక్కలు మాడిపోయిన ఘటనను ప్రస్తావించారు. గతంలో ఓ బాలుడు కూడా క్లోరినేషన్ దాటికి గురై ఆస్పత్రి పాలయ్యాడని గుర్తుచేశారు. కార్పొరేషన్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. కోటి 60 లక్షల రూపాయలతో స్విమ్మింగ్ పూల్ ను ఆధునికరించామని ప్రకటిస్తున్న ప్రజాప్రతినిధులు చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించే అంశాలపై దృష్టి సారించడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి స్విమ్మింగ్ పూల్ టైల్స్ మార్చడం మినహా మరేమీ చేయలేదని తల్లిదండ్రుల ఆరోపించారు. దశాబ్దాల క్రితం నుంచి ఉంటున్న పైపు మార్చకపోవడంతో దాని రబ్బరు తొడుగు పాడై క్లోరిన్ లీకైనట్లు చెబుతున్నారు. అత్యంత అవసరమైన ఇలాంటి మరమత్తులు చేయకుండా పైపై మెరుగులు దిద్దడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జరిగిన ఘటనల నుంచి అధికారులు గుణపాటాలు నేర్చుకుని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
క్లోరిన్ ఘటనలో కుట్ర కోణం
ఈ ఘటనపై మరో వాదన కూడా వినిపిస్తోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ స్విమ్మింగ్ పూల్ లో ప్రైవేటు అసోసియేషన్ల ఆధిపత్య ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ కొత్త ఇన్చార్జిపై కుట్రతో కొందరు..... క్లోరిన్ ను లీక్ చేసే విధంగా కుట్రపన్నారని ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులతో పాటు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించాలని స్ధానికులు కోరుతున్నారు.