విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రుల రెండో రోజు (శుక్రవారం) కనక దుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వెల్లంపల్లికి అమ్మవారి ఫొటోను అందజేశారు.
Also Read: "దుర్గమ్మ గుడి మొత్తం వైఎస్ఆర్‌సీపీ రంగుల లైట్లు..." నిజం కాదు ! ఫేక్ !
కరోనా దూరమై అందరూ సంతోషంగా ఉండాలి..
కరోనా బారి నుంచి దూరమై ప్రజలంతా సంతోషంగా ఉండాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనంద దాయకమని అన్నారు. కార్మికులకు తమ ప్రభుత్వం అన్ని సదుపాయాలు అందిస్తోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, సినీ నటి శ్రీయ సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే పార్థసారథి సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మ వారి ఆశీస్సులు అందరూ పైన ఉండాలని.. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Also Read: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం ప్రాశస్త్యం ఏంటి..?
అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియా..
సినీ నటి శ్రియా కుటుంబ సమేతంగా దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు.. ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు అందరికీ దుర్గమ్మ ఫొటోతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బాలా త్రిపుర సుందరి అంటే?
దసరా నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరి దేవీగా దర్శనమిస్తున్నారు. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్థం. మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం వంటివి బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మవారిని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోవడంతో పాటు నిత్య సంతోషం కలుగుతుందని ప్రతీతి. ఈరోజు 2 నుంచి పదేళ్ల లోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. వారికి పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.
Also Read: ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. గరుడ ధ్వజాన్ని ఎగురవేసిన అర్చకులు..
Also Read: జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్లు.. టీటీడీ బోర్డు మీటింగ్ లోని నిర్ణయాలివే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి