MP Dharmapuri Arvind : బెజవాడను వంగవీటి గడ్డగా అభివర్ణించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఒక అభిమానిగా తన అభిమానాన్ని చాటుకున్నానని, అందుకే వంగవీటి గడ్డ అని అన్నానని ఆయ‌న క్లారిటీ కూడా ఇచ్చారు. అంతే కాదు ప్రధాని మోదీ మీద ఎంత అభిమానం ఉందో... అదే అభిమానం వంగవీటి మీద ఉందన్నారు. విజయవాడ వచ్చి తన అభిమానాన్ని చాటుకోపోతే ఎలా అని వ్యాఖ్యానించారు. చైతన్యం, ఆతిథ్యం, దాతృత్వం, అమృత్వం అన్నీ కలిస్తే విజయవాడ అన్నారు. ఇక తెలుగు రాష్ట్రల్లో వ‌ర్తమాన రాజ‌కీయాలపై బీజేపీ ఎంపీ అర్వింద్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. బీజేపిలోకి  ఎవరొచ్చినా తీసుకుంటామ‌న్నారు. 


ఎంఐఎం చేతుల్లో లా అండ్ ఆర్డర్ 


తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎంఐఎం చేతుల్లో ఉన్నట్టుగా అసదుద్దీన్ కామెంట్లు చేస్తున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. అసద్ కామెంట్లను మంత్రులు తప్పు పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తామంతా గల్లీలో సైనికులమని, దిల్లీలో చాణుక్యులున్నారన్నారు.  ఏపీలో బీజేపీ వైసీపీ, టీడీపీలతో సమాన దూరమే పాటిస్తుంద‌ని వెల్లడించారు. అన్ని పార్టీలను వీక్ చేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమ‌న్నారు. వచ్చే ఎన్నికల నాటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో ఉంటారేమో అని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడంలో భాగంగానే బీజేపీ-టీఆర్ఎస్ పార్టీలు  కుమ్మక్కయ్యాయంటూ రేవంత్ ఏదేదో కామెంట్లు చేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడడంలో రేవంత్ రెడ్డి విఫలం అవుతున్నార‌ని చెప్పారు. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ ఫ్రస్ట్రేటేడ్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో కేంద్రం మీటింగ్ పెడితే కొన్ని సందర్భాల్లో కేసీఆర్ వెళ్లరని, కొన్ని సార్లు జగన్ వెళ్లరని ఇంకెం చేస్తామ‌ని ఎంపీ అర్వింద్  పశ్నించారు. షర్మిళ తెలంగాణలో కష్టపడుతున్నారని, ఆమెకు ఆల్ ద బెస్ట్ అంటూనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని జోస్యం చెప్పారు. 


బెజ‌వాడ లో అర్వింద్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ 


ఎంపీ అర‌వింద్ బెజ‌వాడ‌లో త‌న పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుటుంబ స‌మేతంగా గురువారం ద‌ర్శించుకున్నారు. అమ్మవారి స‌న్నిధికి వ‌చ్చిన అర్వింద్ కు ఆల‌య అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అమ్మవారి ద‌ర్శనం అనంత‌రం అర్వింద్ దంపతులకు వేద ఆశీర్వచనం, ప్రసాదం అందచేశారు.


పార్టీ కార్యక‌ర్తల‌తో స‌మావేశం 


ఏపీ బీజేపీ పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన ఎంపీ అర్వింద్ పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప‌రిస్థితులు గురించి ఆయ‌న వాక‌బు చేశారు. అర్వింద్ ను క‌ల‌సి జ‌న్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తలు పెద్ద ఎత్తున పార్టీ ఆఫీస్ కు  త‌ర‌లివ‌చ్చారు.  


ఎమ్మెల్సీ కవితపై కామెంట్స్ 


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతిసారీ ప్రైవేట్ జెట్లల్లో ప్రయాణించ‌టంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర‌వింద్ అన్నారు. కవిత ప్రైవేట్ జెట్లతో తిరిగిన ఖర్చు ఎవరు పెట్టారని దిల్లీ బీజేపీ వాళ్లు అడిగారన్నారు. వాటికి సమాధానం చెప్పకుండా కోర్టుకెళ్లి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారన్నారు.  సీఎం ఇంటి సభ్యురాలుగా ఉన్న కవిత మరింత బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎంఐఎం చేతుల్లో ఉన్నట్టుగా అసదుద్దీన్ కామెంట్లు చేస్తున్నారన్నారు. అసద్ కామెంట్లను మంత్రులు తప్పు పట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాము గల్లీలో సైనికులం, దిల్లీలో చాణుక్యులున్నారన్నారు. 


Also Read : మతపిచ్చి లేపే తెలంగాణ కావాలా -పంటలు పండే తెలంగాణ కావాలా: కేసీఆర్