వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇండ్ భారత్ కంపెనీలు చేసిన ఆర్థిక అక్రమాలపై సీబీఐ డైరక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ పది బ్యాంకుల వద్ద రూ. 1004 కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టాయన్నారు. తక్షణం ఆ ప్రజా ధనాన్ని రికవరీ చేయాలని కోరారు. ఇండ్ భారత్ కంపెనీలు వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందినవి. రఘురామపై రుణాలు ఎగ్గొట్టిన కేసులు ఇప్పటికే సీబీఐ వద్ద  ఉన్నాయి. ఆయనపై విచారణ కూడా జరుగుతోంది.  కొన్ని కేసులు ఎన్సీఎల్టీలో కూడా ఉన్నాయి. ఈ రుణాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లీడ్ బ్యాంక్‌గా ఉండి ఇచ్చాయి.



రఘురామ కృష్ణరాజు కంపెనీలయిన ఇండ్ భారత్‌ పవర్ ప్రాజెక్ట్స్ పై గతంలో ఇలానే ఆర్బీఐకి కూడా విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. అలాగే విజిలెన్స్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయా సంస్థలు తాము ఫాలో అప్ చేస్తున్నామని విజయసాయిరెడ్డికి సమాచారం ఇచ్చాయి.
ilx


గతంలో  పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. గత ఎన్నికలకు ముందు కూడా  రఘురామ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన కంపెనీరుణాలు తీసుకుని దారి మళ్లించిందన్న ఆరోపమలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసింది. 


సీబీఐకి రఘురామ రుణాలపై ఫిర్యాదు చేయడానికి ముందే  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విజయసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. మర్యాపూర్వకంగా సత్కరించిన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లుగా తన ట్వీట్‌లో తెలిపారు. 


 



వైఎస్ఆర్‌సీపీ ఎంపీగా పోటీ చేసేందుకు రఘురామను టీడీపీలో ఉన్నప్పుడు ఒప్పించి మరీ వైఎస్ఆర్‌సీపీలో చేర్పించింది  విజయసాయిరెడ్డేనన్న ప్రచారం ఉంది.  అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రెబల్‌గా మారిన ఎంపీని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే రఘురామ పూర్తి స్థాయిలో రెబల్‌గా మారి ప్రభుత్వంపై తీవ్ర విమర్సలు చేస్తూండటంతో ఆయనను టార్గెట్‌గా చేసుకుని విజయసాయిరెడ్డి చాలా ప్రయత్నాలుచేస్తున్నారు.  ఆయనపై అనర్హతా వేటు కోసం ప్రయత్నించారు. ఫలితం కనిపించలేదు. ఇప్పుడు విచారణలో ఉన్నసీబీఐ కేసుల్లో వేగం పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు.