YSRCP :  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గా పని చేస్తూ సస్పెండ్ అయిన శాంతి అనే అధికారిణికి పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డేనని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఆయన  మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి అదే చెబుతున్నారు. డీఎన్‌ఏ టెస్టులు చేయించకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రోజు రోజుకు అధికారిణి భర్త మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణల తీవ్రత పెరిగిపోవడంతో ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. 


శాంతి కూతురులాంటిది !                      


దేవాదాయ శాఖ ఉద్యోగిని  శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్  సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా కలిశానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను కూతురుగానే భావించానన్నారు. శాంతికి ఓ తండ్రిలానే  ఏ సహాయం కావాలన్నా చేశానన్నారు. ఆమెకు  కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. ఆ కుమారుడ్ని  తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించానన్నారు.  ఏ పరాయి మహిళతోను అనైతిక,అక్రమ సంబంధాలు లేవని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి సన్నిధి లో కూడా ప్రమాణం చేస్తానన్నారు. 


ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చినట్లేనా ?                          


ఉద్యోగిని శాంతికి రూ.కోటి అరవై లక్షలు రూపాయలు ఇచ్చారని ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. ఇలా డబ్బులతో కూడిన ఓ బ్యాగ్ ఫోటోలను కూడా ఆయన మీడియాకు చూపించారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ఖండించలేదు. ఎలాంటి సాయాన్ని అయినా తాను కూతురిగా భావించి చేశానని చెబుతున్నారు. అంత పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఆ కోణంలోనే సాయం చేశానని విజయసాయిరెడ్డి చెప్పినట్లయిందని అనుకోవచ్చు. ఎవరితోనూ అక్రమ సంబంధాలు లేవని.. విజయసాయిరెడ్డి చెబుతున్నారు.  అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదనికానీ  ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఈ విషయాన్ని ప్రకటిస్తున్నానన్నారు.


డీఎన్‌ఏ టెస్టుపై మౌనం                                                    


అయితే విజయసాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్టు చేయించుకుని నిజాయితీ నిరూపించుకోవాలన్న డిమాండ్ శాంతి భర్త వైపు నుంచి వస్తోంది. శాంతి ఆ బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అనే లాయర్ పేరు చెబతోందని కానీ ఆ లాయర్ మాత్రం ఆ బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలని ఆయనకు పుట్టిన  బిడ్డ కాకపోతే.. తాను కాళ్లు పట్టుకుంటానని అంటున్నారు. విజయసాయిరెడ్డి ప్రమాణాలకు సిద్ధమంటున్నారు కానీ డీఎన్‌ఏ టెస్ట్‌పై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.