Vijayanagaram Teacher:  టీచర్లకు కోపం వస్తే ఏం చేస్తారు.. పిల్లల్ని బాదేస్తారు. చదవకపోయినా మాట వినకపోయినా బెత్తానికి పని చెబుతారు. కానీ ఇదంతా పాత రోజుల్లో. టీచర్లు కొట్టారు అంటే తల్లిదండ్రులు కూడా ఏమీ అనేవారు కాదు. పైగా స్కూల్ కు వచ్చి మా వాడు మాట వినకపోయినా.. సరిగ్గా చదవకపోయినా బాదిపడేయండి.. మేము ఏమీ అనుకోం అని భరోసా ఇచ్చేవాళ్లు. అలా తన్నించుకున్న వారు బాగా చదువుకుని బాగుపడి ఉంటారు..కానీ ఈ రోజుల్లో పిల్లల్ని టీచర్లు కొట్టినా సరే ఎవరూ ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతే. 

టీచర్లు పిల్లలని కొట్టడం కూడా నేరమైపోయింది సమాజంలో అని ఎందుకైనా మంచిదని టీచర్లు కూడా కొట్టడం, తిట్టడం మావేశారు. మరి పిల్లుల మాట ఎలా వింటారు. వినడం లేదు. ఎవరూ వినడం లేదు. చివరికి ఏం చేయాలో తెలియక ఆ హెడ్ మాస్టర్ తనను తాను శిక్షించుకున్నాడు. విజ‌య‌న‌గ‌రం జిల్లా, బొబ్బిలి మండ‌లం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ  ప్రేయర్ సమయంలో  మీటింగ్ పెట్టాడు. పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి. పిల్లలు ఎవరూ చదువుపై ఆసక్తి చూపించడం లేదని మథనపడిపోయారు.  పిల్ల‌ల విద్యా పురోగ‌తి అంతంత‌మాత్రంగా ఉంద‌ని, చెప్పిన మాట విన‌డంలేద‌ని బాధపడ్డారు. విద్యార్థుల‌ను దండించలేక గుంజీలు తీసి తనను తాను శిక్షించుకున్నారు.                                

ఈ వీడియో వైరల్ కావడంతో నారా లోకేష్ స్పందించారు. దండించ‌కుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ‌క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ ఆలోచ‌న బాగుందని అందరం క‌లిసి విద్యాప్ర‌మాణాలు పెంచుదాం. పిల్ల‌ల విద్య‌, శారీర‌క‌, మాన‌సిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేద్దామని పిలుపునిచ్చారు. 

విద్యా మంత్రిగా నారా లోకేష్ ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ప్రభుత్వ స్కూళ్లలో కూడా సంచలనాత్మక మార్పులు తేవాలని అనుకుంటున్నారు.  ఇటీవలి కాలంలో తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను నోట్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం .. సరైన కసరత్తు లేకుండా సీబీఎస్ఈ లాంటి వాటిని ప్రవేశ పెట్టడం వల్ల పిల్లల చదువులననీ డిస్ట్రబ్ అయ్యాయని వాటిని గాడిలో పెట్టాల్సి ఉందని నారా లోకేష్ భావిస్తున్నారు.