Russia Ukraine Ceasefire: అంతం లేని యుద్ధం మాదిరిగా సాగుతున్న ఉక్రెయిన్, రష్యా పోరాటానికి తాత్కలిక ముగింపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రతిపాదించిన నెల రోజుల కాల్పల విరమణకు రష్యా అంగీకారం తెలిపింది.  ఇప్పటికే ఉక్రెయిన్ తమ అంగీకారం తెలిపింది. ఇరవులు అంగీకరించడంతో నెల రోజుల పాటు శాంతి ఏర్పడనుంది.  

ఉక్రెయిన్ , రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లు దాటిపోయింది. ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. రష్యాకూ నష్టమే. అయితే యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత యుద్ధం ఆపేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన రెండుదేశాలోత చ్చలు  జరుపుతున్నారు. ఇటీవల వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చల్లో ట్రంప్ అసహనానికి గురయ్యారు. జెలెన్ స్కి వాదనకు దిగడంతో చర్చలు ఆపేసి ఆయను వైట్ హౌస్ నుంచి పంపేశారు.తర్వాత ఉక్రెయిన్ కు సైనిక సాయం నిలిపివేశారు. 

మరో వైపు ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు కీవ్ అంగీకరించింది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఉక్రెయిన్.. రష్యాతో తక్షణమే చర్చలు జరగాలని స్పష్టం చేసింది.  30 రోజుల పాటు సాధారణ కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌ అంగీకరించడంతో... సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి కీవ్‌పై విధించిన ఆంక్షలు అమెరికా ఎత్తివేసింది.  

అయితే ఈ అంశంపై రష్యా వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అమెరికా పెట్టే షరతులకు తాము వ్యతిరేకమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది.  ఇలాంటి ప్రతిపాదనలు తాత్కలికమేనని రష్యా వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.