Venkayya On Amaravati :   రాజధానిపై ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్లాలని మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఒక విద్యార్థి రాజధానిపై వెంకయ్య ను ప్రశ్నించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనన్నారు. అమరావతిపై తన అభిప్రాయం ముందే చెప్పానన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానన్నారు. పట్టణాభివృద్ధి మంత్రిగా నిధులు కూడా మంజూరు చేశాన‌న్నారు. ఇప్ప‌టికే మీకు అర్థ‌మై ఉంటుందంటూ వెంక‌య్య‌నాయుడు క్లారిటీ ఇచ్చారు.         

  


ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత వెంకయ్యనాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెబుతున్నారు. అందుకే ఆయన రాజకీయ పరమైన ప్రకటనలు చేయడం లేదని తెలుస్తోంది. అయితే విద్యార్థులకు ఇచ్చిన సమాధానంలోనే ఆయన అసలు తన వైఖరి కూడా చెప్పారని అర్థం చేసుకోవచ్చు. అమరావతి విషయంలో గతంలో ఆయన పూర్తి మద్దతుగా ఉండేవారు. తన మంత్రిత్వ శాఖ నుంచే కాదు..  బీజేపీలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఇతర విధాలగానూ  అమరావతికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. అందుకే తాను అమరావతి కోసం చేసిన పనులను గుర్తు చేసి మీకు అర్థమై ఉంటుందని విద్యార్థులతో చెప్పారని అర్థం చేసుకోవచ్చు.                 


2015లో అప్పటి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం కాలేదు. అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఫలానా ప్రాంతానికి రాజధాని కావాలని ఎక్కడా డిమాండ్లు కూడా రాలేదు. గత ఎన్నికల ముందు కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేస్తామని వైసీపీ కూడా ప్రకటించింది కానీ అనూహ్యంగా గెలిచిన తర్వాత మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చారు. దీంతో ఒక్క సారిగా రాజధాని వివాదం ప్రారంభమయింది .అది  ఇంకా కొనసాగుతోంది. సాంకేతికంగా ఇప్పటికీ అమరావతే రాజధాని. అయితే ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా అంగీకరించేందుకు సిద్ధంగా లేకపోవడం.. పదే పదే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు వస్తూండటంతో ఇదో హాట్ టాపిక్ గా ఉండిపోయింది.       


నిజానికి న్యాయస్థానాల్లోనూ అమరావతి రైతులకు ఊరట లబించింది. సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతినే రాజధానిగా అభివృద్ది చేయాలని హైకోర్టు కూడా ఆదేశించింది. అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ నెల ఇరవై మూడో తేదీన విచారణ జరగాల్సి ఉంది. అదే సమయంలో  కేంద్ర ప్రభుత్వం.. చట్ట ప్రకారమే.. అమరావతి రాజధానిగా ఏర్పాటియందని ప్రకటించింది.అయితే ప్రభుత్వం మాత్రం తాము విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ప్రకటిస్తోంది.                            


బీఆర్ఎస్‌లో చేరే వారందరికీ డబ్బులిస్తున్నారా ? - కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు !