Fancy Number Plates: చదువుకునే రోజుల్లో అయితే బైకు, కాస్త పెద్దయ్యాక కారు కొనుక్కోవాలనేది ప్రతీ ఒక్కరి కల. దాన్నితీర్చుకోవడం కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఎంతో కష్టపడి కొన్న కారుకు.. నచ్చిన నంబర్ ఉండాలన్న మరో సెంటిమెంట్ చాలా మందిలో కనిపిస్తుంది. ఫోన్ నంబర్ల నుంచి మొదలుకొని వాహనాల నంబర్ల వరకు ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వాళ్లు కోకొల్లలు. ఇందుకోసం ఎంత డబ్బు చెల్లించడానికైనా వెనుకాడరు. ఏడాది క్రితం ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ 50 వేల ప్రారంభ ధర ఉంటే 9999 నంబర్ వేలంలో రూ.7.20 లక్షలు పలికింది. అనంతపురానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఈ నంబర్ కోసం పోటీ పడి మరి దక్కించుకున్నాడు. ఫ్యాన్సీ నంబర్ రూపంలో రవాణా శాఖకు ఏటా కోట్లలో ఆదాయం సమకూరుతోంది. 


ఎక్కువ శాతం సంపన్నులు ఈ నంబర్లకు పోటీ పడుతున్నారు. గతంలో ఉన్న ధరలను ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అనంతపురం ఆర్టీఓ సురేష్ నాయుడు తెలిపారు. అయితే 9999 నంబర్ కు రెండు లక్షలు, 1, 9, 999 నంబర్లకు లక్ష, 99, 3333, 4444, 5555, 6666, 7777 నంబర్లకు 50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 5, 6, 7, 333, 369, 555, 666, 777, 1116, 1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 8055, 8888, నంబర్లకు 20 వేలు కాగా.. 3, 111, 123, 234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999, 7999, 9009 నంబర్లకు 15 వేల ధర పలుకుతోంది. 2, 4, 8, 18, 27, 36, 45, 77, 143, 222, 444, 786, 789, 909, 1133, 1233, 1269, 1359, 2223, 2255, 2349, 3344, 3399, 3555, 3789 నంబర్లకు 10 వేల రూపాయల చొప్పున ప్రారంభ ధరలుగా నిర్ణయించారు. పోటీని బట్టి సదరు నంబర్ కు ఎంత ధర అయినా పలకవచ్చు. 


ప్రభుత్వానికి అదనపు ఆదాయం..


రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏడాదిలో  రూ. 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫీజులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదాహరణకు 9999 ఫ్యాన్సీ నెంబరుకు రూ. 2 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటే, 1, 9, 9999 ఫ్యాన్సీ నెంబర్లకు రూ. లక్ష రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. మిగిలిన ఫ్యాన్సీ నంబర్లకు రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఒకే నంబర్ కు ఒకరి కంటే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేట్ల ఆధారంగా ఫ్యాన్సీ నంబర్లను రవాణా శాఖ అధికారులు బిడ్డింగ్ వేస్తారు. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులకు సంబంధించి రవాణా శాఖ చట్ట సవరణ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా ఏమైన అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి.